Actor Ajay: సినిమాల్లో అవకాశాలు రావడం అంటే మామూలు కాదు. దానికి ఎంతో కృషి ఉండాలి. పట్టుదల కావాలి. ఎన్నో కష్టాలు పడాలి. అలా వచ్చిన వారిలో చాలా మంది వారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అలా వచ్చిన వారిలో అజయ్ ఒకరు. స్నేహితుడిగా, అన్నయ్యగా, విలన్ గా పలు పాత్రల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులకు వినోదం పంచారు. ఇరవై రెండేళ్లుగా నటిస్తూనే ఉన్నాడు. తనకు తగిన పాత్ర రాకపోతే నో చెప్పే అజయ్ ఇటీవల కాలంలో చాలా కాలం గ్యాప్ ఇచ్చి ఓ వెబ్ సిరీస్ లో కనిపించాడు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

19 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయి నేపాల్ వెళ్లాడు. అక్కడ డబ్బులు లేక హోటల్ లో గిన్నెలు తోమి డబ్బులు సంపాదించుకుని ఇంటికి వచ్చాడు. తన కెరీర్ లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. అవకాశాలు ఊరికే రావు. దానికి ఎంతో శ్రమ ఉంటుంది. వచ్చిన అవకాశాలను కూడా కాపాడుకోవడానికి చాలా శ్రమించాల్సి వస్తుంది. అలా వచ్చిన నటుల్లో అజయ్ కూడా ఒకరు కావడం గమనార్హం. తనకు సినిమాలకు మధ్య విరామం రావడానికి గల కారణాలను వివరించాడు. తగిన పాత్రలు రాకపోతే నటించడానికి నిర్మొహమాటంగా నో చెప్పడం అజయ్ కు అలవాటు.
విక్రమార్కుడు సినిమాలో ప్రతినాయకుడిగా చేసిన పాత్రకు ఎంతో గుర్తింపు వచ్చింది. అంతవరకు చిన్న చిన్న పాత్రలు చేసిన అజయ్ ఏకంగా విలన్ గా చూపించడంలో రాజమౌళిదే క్రెడిటంతా. కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తనకు నచ్చిన పాత్రలు రాకపోవడంతోనే దూరంగా ఉంటున్నట్లు పేర్కొన్నాడు. ఇటీవల 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ కు ఓటీటీ ద్వారా సినీప్రియులకు దగ్గరయ్యాడు. తాను సినిమాలకు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందో వివరించాడు.

శ్రీమహాలక్ష్మి సినిమాలో ఓ రేప్ సన్నివేశంలో నటించేటప్పుడు చేయి పట్టుకోవడంతో ఆమె గట్టిగా అరవడంతో ఇక ఆ సీన్ చేయలేనని చెప్పాడు. అందరి ముందు రేప్ సీన్ లో నటించాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఎక్కువగా అలాంటి సీన్లలో నటించేందుకు అంగీకరించేవాడిని కాను. అజయ్ ఇటీవల కాలంలో సరైన పాత్రలు రాకపోవడంతో నటించడం లేదు. దీంతో విరామం రావడంతో అందరు అడుగుతున్నారు. తగిన పాత్రలు వస్తే నటించడానికి ఎప్పుడు సిద్ధమేనని అజయ్ చెబుతున్నాడు.