Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి కూడా లీకుల బెడద తప్పట్లేదు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు రానుండగా… దీంతో ఆయన అభిమానులంతా రెండు వారాల ముందు నుంచే ప్రభాస్ బర్త్‌డే పేరుతో హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో అనుకోని రీతిలో సలార్ చిత్రం లోని యాక్షన్ సీన్ నెట్ లో ప్రత్యక్షమవడం అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రస్తుతం ఈ లీక్ అయిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్‌తో… ప్రభాస్ బిజీగా ఉన్నాడు. సినిమా ఆరంభం నుంచే ‘సలార్’ కి లీక్‌ల బెడద తప్పడం లేదు. ఈ మూవీ సెట్స్‌లోని ప్రభాస్ ఫొటోలు, వీడియోలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో సలార్ మూవీ సెట్ లో ప్రభాస్‌పై చిత్రీకరిస్తున్న యాక్షన్ సీన్ మేకింగ్ వీడియో ఒకటి లీక్ అయ్యింది. ఈ వీడియోలో ప్రభాస్‌తో చేతిలో గన్ తో ఉండగా… ఫైట్ సీన్ అని అర్థమవుతోంది. ప్రభాస్ బర్త్‌డే నేపథ్యంలో ఈ వీడియో బయటకు రావడంతో ఫ్యాన్స్ లో మరింత జోష్ నెలకొంది.
ప్రస్తుతం ప్రభాస్ సలార్‌తో పాటు ఓం రావత్ డైరెక్షన్‌లో రూపొందుతోన్న ‘ఆదిపురుష్’ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాడు. అలానే రాధ కృష్ణ తెరకెక్కించిన రాధేశ్యామ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్దమవుతోంది. దీని తర్వాత నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా చిత్రాల్లో ప్రభాస్ నటించనున్నాడు.