Kajal Aggarwal: చిరంజీవితో నటించడం నరకం.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్…

చిరంజీవి పక్కన నటిస్తే చాలు వాళ్ళందరూ స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులుగా మారిపోతారు స్టార్ ఇమేజ్ ని సంపాదించుకుంటారు. కాబట్టి చిరంజీవి సినిమాలో ఎవరికి అవకాశం వచ్చిన వదులుకోకుండా నటిస్తూ ఉంటారు.

Written By: Gopi, Updated On : December 19, 2023 10:42 am

Kajal Aggarwal

Follow us on

Kajal Aggarwal: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు మూడు దశాబ్దాల పాటు నెంబర్ వన్ హీరోగా కొనసాగిన ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి…చాలామంది దర్శకులు ఆయనతో ఒక్క సినిమా అయిన చేయాలని కోరుకుంటారు. అలాగే చాలామంది నటీనటులు ఆయన పక్కన ఒక్క సినిమాలో అయిన నటించాలి అని ఆరాటపడుతుంటారు.

చిరంజీవి పక్కన నటిస్తే చాలు వాళ్ళందరూ స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులుగా మారిపోతారు స్టార్ ఇమేజ్ ని సంపాదించుకుంటారు. కాబట్టి చిరంజీవి సినిమాలో ఎవరికి అవకాశం వచ్చిన వదులుకోకుండా నటిస్తూ ఉంటారు. కానీ ఒక హీరోయిన్ మాత్రం చిరంజీవి మీద కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆవిడ ఎవరు ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటో మనం ఒక్కసారి తెలుసుకుందాం…

చిరంజీవి రీ ఎంట్రీ లో దర్శకుడు వి వి వినాయక్ డైరెక్షన్ లో నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించింది. అయితే కాజల్ అగర్వాల్ చిరంజీవి గురించి మాట్లాడుతూ ఆయనతో నటించడం నరకమంటూ కొన్ని కామెంట్లు అయితే చేసింది. ఇక దాదాపు చిరంజీవి సినిమాలకు బ్రేక్ ఇచ్చిన 10 సంవత్సరాల తర్వాత రీఎంట్రీలో ఈ సినిమా చేశాడు. దాంతో ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన కాజల్ అగర్వాల్ చిరంజీవి ని ఉద్దేశిస్తూ ఆయనతో నటించడం అంటే నరకం అంటూ కామెంట్ చేసింది. ఆమె ఏ ఉద్దేశ్యం తో మాట్లాడింది అంటే చిరంజీవి పక్కన డాన్సులు చేయడం అంటే మామూలు విషయం కాదు.

ఆయన గ్రేస్ ని, ఆయన స్పీడ్ ని అందుకోవాలంటే మన వల్ల కాదు. అందుకే ఖైదీ నెంబర్ 150 సినిమాలో సాంగ్స్ షూట్ చేస్తున్నప్పుడు కొన్ని స్టెప్స్ వేయడం నా వల్ల కాకపోతే చిరంజీవి గారే దగ్గరుండి ఎలా చేయాలి అనేది నాకు చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు. కొన్నిసార్లు అయితే చిరంజీవి పక్కన డాన్స్ చేయడం నరకమని అనిపించేది. 60 సంవత్సరాల వయసులో కూడా ఆయన అంత గ్రేస్ తో డాన్స్ చేస్తున్నాడు అంటే ఆయనకి సినిమా అంటే ఎంత డెడికేషన్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఏ వర్క్ చేసిన హార్ట్ ఫుల్ గా చేస్తూ ఉంటే 100% సక్సెస్ సాధిస్తామని ఆయనని చూశాక తెలిసింది.ఇక కాజల్ అగర్వాల్ ఖైదీ నెంబర్ 150 తో పాటు గా ఆచార్య సినిమాలో కూడా చిరంజీవితో నటించింది. కానీ లెంత్ ఎక్కువ అవ్వడం తో ఆమె నటించిన ఆ సీన్స్ ని సినిమా లో నుంచి తీసివేశారు…