Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న హీరో ప్రభాస్(Prabhas)… ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాయి. ఇక ఇప్పుడు ఆయన వరుసగా స్టార్ డైరెక్టర్ తో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. మరి ఆయన చేసిన సినిమాలు కూడా పాన్ ఇండియా ప్రేక్షకులందరికి చాలా మంచి ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులకు ప్రభాస్ సినిమాలు విపరీతంగా నచ్చేస్తున్నాయి. అందుకే ఆయన ఫ్లాప్ సినిమాకి కూడా భారీ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి… ఎప్పుడైతే బాహుబలి(Bahubali) సినిమా చేశాడో అప్పటి నుంచి ప్రభాస్ స్టార్ డమ్ అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. మిగతా హీరోలేవరికీ అందనంత ఎత్తులో ఆయన ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ ఇప్పటి వరకు చాలా వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ వచ్చాడు. కానీ ఆయనకు ఒక పాత్ర చేయడం అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుందంట…
అది ఏంటి అంటే డాక్టర్ పాత్ర పోషించాలి అంటే ఆయనకు అంత పెద్దగా నచ్చదట. ఎందుకంటే అందులో ఆయన ట్రీట్మెంట్ చేయడం సిరంజ్ పట్టుకొని ఇంజక్షన్స్ చేయడం లాంటివి అతనికి కొంతవరకు ఇబ్బందిని కలిగిస్తాయని ఇప్పటివరకు ఆయన డాక్టర్ పాత్రనైతే పోషించలేదట. మరి ఇక మీదట అలాంటి పాత్రలు వస్తే చేయడానికి తనకి అభ్యంతరం లేనప్పటికి కొంచెం భయం అయితే ఉంటుందట.
మరి ఎందుకు ఆయన అంతలా భయపడుతున్నాడు అంటే ఆయనకి చిన్నప్పటి నుంచి ఇంజక్షన్స్ అంటే ఫోబియా ఉందట అందుకే ఆయన అలా ఫీల్ అవుతున్నాడు… మరి ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి… ఇక ప్రస్తుతం ప్రభాస్ లాంటి స్టార్ హీరో తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నాడనే చెప్పాలి. మరి ఇతను అనుకున్నట్టుగానే భారీ విజయాన్ని సాధిస్తూ ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
చూడాలి మరి ఇక మీదట రాబోయే సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు. తద్వారా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతాడా? లేదా అనేది…ఇకతెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయడంలో ప్రభాస్ కూడా కీలకపాత్ర వహిస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…