Superstar Krishna: తెలుగు సినిమా స్థాయిని పెంచిన వ్యక్తి ‘సూపర్ స్టార్ కృష్ణ’. ఆయన తెలుగు వెండితెరకు ఎనలేని సేవలు చేశారు. మరి, ఆయన సాధించిన ఘనతలు, ఆయన జీవితాలలో జరిగిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు విశేషాలు మీ కోసం.
కృష్ణది గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బుర్రిపాలెం..ఘట్టమనేని రాఘవయ్య , నాగరత్నమ్మలకు 1943, మే 31న జన్మించారు. ఐదుగురు సంతానంలో కృష్ణే పెద్దవారు. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ. సినిమాల్లోకి వచ్చాకే కృష్ణ అయ్యారు. కృష్ణ బాల్యమంతా తెనాలిలోనే గడిచింది. పదో తరగతి వరకు అక్కడే చదివారు. ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజిలో బీఎస్సీ పూర్తి చేశారు. మురళీమోహన్, క్రాంతి కుమార్‌లు అప్పుడాయనకు రూమ్‌మెట్స్. డిగ్రీ అయిందో లేదో కృష్ణకు పెళ్లి కూడా చేసేశారు తల్లిదండ్రులు.19వ ఏట ఇందిరాదేవితో కృష్ణకు వివాహమైంది.
Also Read: R S Praveen Kumar- Akunuri Murali: ఆరెస్పె.. ఆకునూరితో మార్పు సాధ్యమేనా? వారు ప్రయత్నం పలించేనా!?
కృష్ణ సాధించిన ఘనతలు:
ఆయన హీరోగా నటించిన మొదటి సినిమా తేనెమనసులు. దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేశారు సూపర్ స్టార్ కృష్ణ.
తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) ఇదంతా కృష్ణ ఘనతే.
తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడూ ఈయనే. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో 350 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించారు కృష్ణ.
1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించి పద్మాలయా సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలన చిత్రాలు అందించారు.
1976 నుంచి 1996 వరకు 21 సంవత్సరాల పాటు ప్రతి ఏటా వరుసగా సంక్రాంతికి సినిమాలు విడుదల చేసి రికార్డు సృష్టించారు.
మద్రాసులోని విజిపి గార్డెన్స్‌లో నిర్వహించిన కృష్ణ సింహాసనం శతదినోత్సవానికి 400 బస్సుల్లో 30 వేలమంది అభిమానులు ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిరావడాన్ని చూసిన తమిళనాడు ప్రభుత్వాధికారులు ఆశ్చర్యపోయారు.
కృష్ణకు 2500 అభిమాన సంఘాలు ఉండేవి. ఊరూరా ఉన్న అభిమాన సంఘాలు వందల సంఖ్యలో ఉండేవి.
1973లో సవేరా హోటల్లో 31వ పుట్టినరోజును కృష్ణ నిర్మాతలు అందరూ కలిసి వేడుకగా నిర్వహించడంతో కృష్ణ భారీ పుట్టినరోజు పండగల సంప్రదాయం ప్రారంభం అయింది.
Also Read: Telugu TV Actress Maithili: వీడియో కాల్ చేసి మరీ టీవీ సీరియల్ నటి ఆత్మహత్యాయత్నం
భేషజం లేని మనిషి కృష్ణ….అందుకే అన్నేసి మల్టీస్టారర్ సినిమాలు చేయగలిగాడు. నొప్పింపక తానొవ్వక ఇండ్రస్టీలో మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక తానో గొప్ప యాక్టర్‌నని కృష్ణ ఏనాడు చెప్పుకోలేదు. బిరుదులకు ఆశపడలేదు. అవార్డుల కోసం వెంపర్లాడలేదు. మూడు వందల యాభైకి పైగా సినిమాలలో నటించిన ఏకైక హీరో కృష్ణనే!
తనతో సినిమా తీసి నిర్మాత ఆర్థికంగా నష్టపోయినప్పుడు తానే నిర్మాత వద్దకు వెళ్ళి వాళ్ళు దెబ్బతినకుండా ఉండేందుకు వెంటనే మంచి సినిమా ప్లాన్ చేయమని, అడ్వాన్స్ అక్కర్లేదని డేట్లు ఇచ్చేవాడు. విడుదలకు ముందు నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే, తన పారితోషికం వదులుకునేవాడు.”హీరోగా అతను పైకి రావడానికి మంచితనం కూడా ఒక కారణం” అంటారు సహనటుడు కైకాల సత్యనారాయణ.
రాష్ట్రంలో తుఫానులు, ప్రకృతి వైపరీత్యాలు వచ్ఛినప్పుడు ఇతోధికంగా కృష్ణ సహాయం చేసేవారు.
లోక్‌సభ సభ్యునిగా కృష్ణ :
రాజకీయ రంగంలోకి కూడా ప్రవేశించారు కృష్ణ. 1989లో ఏలూరు నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యునిగా గెలుపొందారు.
కృష్ణ దరికి చేరిన అవార్డులు:
కృష్ణ నటించిన సాక్షి చిత్రం 1968 లో తాష్కెంట్ చలన చిత్రోత్సవంలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 1972 లోఅతను పండంటి కపురం ఉత్తమ చలన చిత్రానికి జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని పొందింది.
కృష్ణ ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.
కృష్ణ 2009లో పద్మ భూషణ్ కూడా అందుకున్నారు.
నంది అవార్డులు:
అల్లూరి సీతారామరాజు చిత్రానికి ఉత్తమ నటుడిగా నంది అవార్డు ఆందుకున్నారు.
2003 సంవత్సరానికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు ఆందుకున్నారు.
1997 లో సౌత్ ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఆందుకున్నారు.
కృష్ణ మంచి నటుడే కాదు, దర్శకుడు కూడా.. దాదాపు 14 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు.. మంచి ఎడిటర్ కూడా! తెలుగు సినిమాకు దొరికిన రత్నం సూపర్ స్టార్ కృష్ణ.
Also Read:Superstar Krishna Birthday: సాహసం ఆయన ఊపిరి.. ధైర్యం ఆయన చిరునామా