Acharya: కొత్త ఏడాదికి అదిరిపోయే ట్రీట్​తో రెడీ అంటున్న ‘ఆచార్య’

Acharya: మెగాస్టార్‌ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న చిత్రం “ఆచార్య”. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా న‌టిస్తుండ‌టంతో మూవీపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. అలానే ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజల్… చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‏టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మణిశర్మ మరోసారి తన  మ్యూజిక్ తో అందరినీ మ్యాజిక్ చేయనున్నారు. ఇప్పటికే ఈ […]

Written By: Raghava Rao Gara, Updated On : December 23, 2021 12:55 pm
Follow us on

Acharya: మెగాస్టార్‌ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న చిత్రం “ఆచార్య”. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా న‌టిస్తుండ‌టంతో మూవీపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. అలానే ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజల్… చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‏టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మణిశర్మ మరోసారి తన  మ్యూజిక్ తో అందరినీ మ్యాజిక్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, టీజర్లు నెట్టింట ట్రెండింగ్​లో దూసుకెళ్లిపోతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం కొత్త సంవత్సరం కానుకగా ఈ సినిమా నుంచి మాస్సీవ్​ అప్​డేట్​ రానుందట.. మెగాస్టార్​, రామ్​చరణ్​లకు సంబంధించిన వండర్​ విజువల్స్​తో మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బహుశా, వీరిద్దరు కలిసి డాన్స్ చేసిన వీడియో కూడా అయ్యుండచ్చని టాక్​. ఫిబ్రవరిలో4న ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కచ్చితంగా కొత్త ఏడాదికి ఈ అప్​డేట్​ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక మెగాస్టార్ సినిమాల విషయానికి వస్తే  మలయాళం మూవీ ” లూసిఫర్ ” రీమేక్ గా తెరకెక్కుతున్న ‘గాడ్‌ ఫాదర్‌’ షూటింగ్ జరుపుకుంటుంది. వీటితో పాటు మెహర్‌ రమేశ్ డైరెక్షన్ లో ” భోళా శంకర్ ”, బాబీతో మరో సినిమా చేయనున్నారు. మరోవైపు ఆర్​ఆర్​ఆర్​ సినిమాతో ఫుల్​ బిజీగా ఉన్నారు రామ్​చరణ్​.. ఈ సినిమా తర్వాత శంకర్​ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.