Acharya: ‘ఆచార్య’ చూసిన వారంతా చెప్పిన ఒకే ఒక్క మాట.. ఇదే !

Acharya: కొరటాల శివ ఏం చేయ‌గ‌ల‌డో ? ఎంత చేయ‌గ‌ల‌డో ? కొత్తగా చెప్పేదేముంది ? కమర్షియల్ అంటూ గిరి గీసుకున్న తెలుగు సినిమాని సామాజిక అంశాలతో తెలుగు తెరకు గౌరవం తెచ్చిన దర్శకుడు. సినిమా ద్వారా కూడా సమాజ సేవ చెయ్యొచ్చు అని నిరూపించిన సినీ కామ్రేడ్. సినిమా సినిమాకీ ఓ సమస్యను తీసుకుని, త‌న సినిమా ద్వారా ఆ సమస్యకి పరిష్కారం చెబుతూ.. సమాజ ఉద్దరణకు పాటు పడుతున్న ఫీల్ గుడ్ అండ్ క్లాసిక్ […]

Written By: Shiva, Updated On : April 28, 2022 2:52 pm
Follow us on

Acharya: కొరటాల శివ ఏం చేయ‌గ‌ల‌డో ? ఎంత చేయ‌గ‌ల‌డో ? కొత్తగా చెప్పేదేముంది ? కమర్షియల్ అంటూ గిరి గీసుకున్న తెలుగు సినిమాని సామాజిక అంశాలతో తెలుగు తెరకు గౌరవం తెచ్చిన దర్శకుడు. సినిమా ద్వారా కూడా సమాజ సేవ చెయ్యొచ్చు అని నిరూపించిన సినీ కామ్రేడ్. సినిమా సినిమాకీ ఓ సమస్యను తీసుకుని, త‌న సినిమా ద్వారా ఆ సమస్యకి పరిష్కారం చెబుతూ.. సమాజ ఉద్దరణకు పాటు పడుతున్న ఫీల్ గుడ్ అండ్ క్లాసిక్ డైరెక్టర్ కొరటాల.

Acharya

పైగా వెలిగిపోతున్న హీరోల క్రేజ్ రెప‌రెప‌లాడించ‌గ‌ల‌ వినూత్న దర్శకుడు కొరటాల. ఐతే, కొరటాల ఇప్పటివరకూ దర్శకుడిగా తాను ఎదుగుతూ, త‌న సినిమాని పైపైకి తీసుకెళ్తూ, దాంతో పాటుగా హీరోల స్థాయిని కూడా పెంచుతూ వెళ్ళాడు. కానీ, ఇప్పుడు అంతకు మించి. అవును, కొరటాల దర్శకత్వం వహించిన ఆచార్య సినిమా గురించే ఇదంతా.

Also Read: Samantha Birthday: దేవకన్యలా సమంత రచ్చ.. లుక్ చూసి మెంటలెక్కిపోతున్న ఫ్యాన్స్ !

మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ కలయికలో రాబోతున్న సినిమా ఇది. త్వరగా చూడాలని ఎప్పటినుంచో మెగాభిమానులు ఎదురుచూస్తున్న సినిమా ఇది. ‘ఆచార్య’ సినిమా ఎలా ఉండబోతుంది ? ఇదే ప్రస్తుతం వైరల్ క్వశ్చన్. నిన్న జరిగిన ప్రివ్యూలో కొందరు సినీ ప్రముఖులు ఆల్ రెడీ ఆచార్య సినిమాని చూసేశారు.

Acharya

సినిమా చూసిన వారంతా చెప్పిన ఒకే ఒక్క మాట. ఆచార్యలో ప్రధాన ఆకర్షణ అంతా సెకండాఫే అని. కారణం.. రామ్ చరణ్ పాత్ర ద్వీతీయార్ధంలో వస్తుంది. ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అయిన చరణ్ పాత్ర.. కొన్ని సన్నివేశాలతో హృదయాల్ని పిండేస్తోంది. పైగా సెకండ్ హాఫ్ ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు కొరటాల ట్రేడ్ మార్క్ తో ఈ సినిమా చాలా బలంగా సాగుతుంది.

అన్నిటికీ మించి భిన్నమైన కథ, కథనాలు సెకండ్ హాఫ్ లో ఎక్కువగా కనిపిస్తాయి. నిజానికి, కొరటాల శివ మొదటి నుంచి తన సినిమాల్లో సెకండ్ హాఫ్ ను చాలా బలంగా రాసుకుంటూ వస్తున్నాడు. కానీ, ఆచార్యలో మాత్రం ఆ బలం రెండింతలు పెరిగింది. కొన్ని చోట్ల ఐతే.. ప్రేక్షకులు విజిల్స్ వేసి వేసి అలసిసొలసి పోయే స్థాయిలో ఉన్నాయి హైలైట్ సీన్స్.

Acharya

‘శ్రీమంతుడు’లో తోట ఫైట్, ‘భరత్ అనే నేను’లో థియేటర్ ఫైట్, ‘జనతా గ్యారేజ్’లో ఎన్టీఆర్ రైజింగ్ సీన్స్ ఎలా ఐతే ఆయా సినిమాల విజయాలకు ప్రధాన కారణం అయ్యాయో.. ఆచార్యలో అలాంటి సీన్స్ 20 కి పైగా ఉన్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి చేసే ఎమోషనల్ సీన్స్ అబ్బురపరుస్తాయి. ఇప్పటికే కొరటాల శివకి 100 శాతం సక్సెస్ రేట్ ఉంది. ఆచార్య సినిమాతో ఆ సక్సెస్ రేట్ కి ఇక బోర్డర్స్ బద్దలు కాబోతున్నాయి.

Also Read:Advance Bookings: అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ ఏడాది అత్యధిక టికెట్స్ అమ్ముడుపోయిన సినిమా ఏమిటో తెలుసా?

Recommended Videos:

Tags