Acharya: అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బెల్ పిట్ట. ఆచార్య సినిమాపై అందరికి భారీ అంచనాలు వచ్చాయి. సినిమా పెద్ద హిట్ అవుతుందని అందరు విశ్వసించారు. అలాగే ముందుకు వెళ్లారు. కానీ రిలీజయిన తొలిరోజే చేదు అనుభవం ఎదురైంది. కలెక్షన్లు నిల్ గా ఉన్నాయి. అన్ని కోట్లు వసూలు చేస్తుంది ఇన్ని కోట్లు తెస్తుందని అందరు బాగానే ఊహించుకున్న వారి ఆశలు అడియాశలే అయ్యాయి. దర్శకుడు కొరటాల శివ మీద నమ్మకంతోనే ఇంత ప్రాజెక్టు చేపట్టినా చివరకు చేదు అనుభవమే ఎదురైంది.
సినిమా సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుందని అనుకున్నారు. కానీ నష్టాల్లో సైతం కొత్త ఒరవడి తెచ్చుకుంది. బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టిన సినిమాగా రికార్డులకెక్కనుంది. మొదటి రోజు వసూళ్లు తక్కువగానే వచ్చాయి. ఇక రెండో రోజైతే కేవలం రూ. 5 కోట్లు వసూలు చేయడం గమనార్హం. దీంతో సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలుస్తోంది. డైరెక్టర్, హీరోలకు కూడా పారితోషికం కూడా వచ్చే అవకాశమే కనిపించడం లేదు.
మొదటి రోజు కలెక్షన్లు రూ. 29 కోట్లు రావడంతో రెండో రోజు పుంజుకుంటుందని అనుకున్నా చతికిలపడింది. దీంతో నష్టాలే మూటగట్టుకోనుంది. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేకుండా పోతోంది. ఇప్పుడు అటు డైరెక్టర్, ఇటు హీరోల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. పైగా మొదటి సారి తండ్రి కొడుకులు ఫుల్ లెంగ్త్ పాత్రలు చేయడం తెలిసిందే. కలలో కూడా ఊహించని విధంగా కలెక్షన్లు రాకపోవడం విడ్డూరమే.
Also Read: ‘సర్కారివారి పాట’ ట్రైలర్ లీక్.. మహేష్ కు గట్టి షాక్
అయితే సినిమాకు కొన్ని మైనస్ లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ట్రెండ్ లో లేని మణిశర్మ సంగీతం పెద్ద మైనస్ అని చెబుతున్నారు. ప్రస్తుతం ట్రెండ్ థమన్ ది నడుస్తుంటే వీరు మాత్రం మణిశర్మను ఎంచుకుని మొదటి తప్పు చేశారని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 132 కోట్ల ప్రింట్లతో విడుదలైనా అంచనాలు అందుకోలేక వెనుకబడిపోయింది.
మొత్తంగా రూ. 50 కోట్లు వసూలు చేస్తుందో లేదో అనేది కూడా అనుమానమే. ఈ పరిస్థితిలో థియటర్ల సంఖ్య కూడా తగ్గుతోంది. ఆచార్య సినిమా ఇంతలా నిరాశ పరుస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. దాదాపు రూ.80కోట్ల నష్టం మూటగట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు ఏం చేస్తారు. ఇక సినిమా బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం చిరంజీవి సినిమా కావడంతో ముందే కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
Also Read: ‘ఆచార్య’కు ఇంతటి అవమానమేల..?