Acharya: మెగా అభిమానులంతా ‘ఆచార్య’ సినిమా చూడటం కోసం గత మూడేళ్ళ నుంచి పడిగాపులు కాస్తున్నారు. మరి ఈ సినిమా ప్రీమియర్ షోస్ ఎప్పుడు పడబోతున్నాయి ? ముందుగా ఏ దేశంలో షోలు స్టార్ట్ అవ్వనున్నాయి ? లాంటి విషయాలు తెలుసుకుందాం. అమెరికాలోని డల్లాస్ లో ‘సినిమార్క్ 17 వెబ్ ఛాపెల్ థియేటర్’లో ముందుగా ప్రీమియర్ షో పడనుంది.
ఇప్పటికే, ఈ థియేటర్ లో ‘ఆచార్య’ టికెట్ల అమ్మకాలు మొదలయ్యాయి. అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 28వ తేదీన సాయంత్రం 3 గంటలకు ఈ సినిమా ప్రీమియర్ షో పడుతుంది. ‘ఆచార్య’ చిత్రాన్ని XD, RPX, EMAX, DLF, Ultra, ఇంకా మరికొన్ని స్కీన్లలో ప్రదర్శించేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేస్తుండటం విశేషం.
Also Read: RRR Box Office Collection: RRR: 4 వారాల్లో ఎన్ని వందల కోట్లు వచ్చాయంటే ?
డల్లాస్‌లో సోమవారం నుంచే ‘ఆచార్య’ అడ్వాన్సు బుకింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. తొలుత 10 లొకేషన్లలో 28 షోల కోసం టికెట్ల అమ్మకాలు ప్రారంభిస్తే.. మెగా ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. టికెట్లు కోసం ప్రేక్షకులు ఎగబడ్డారు. దాంతో టికెట్ రేట్లను కూడా అనూహ్యంగా పెంచేశారు.
డల్లాస్ లో ప్రస్తుతం ‘ఆచార్య’ టికెట్ రేటు 21 డాలర్లుగా ఉంది. ఇప్పటివరకు అమ్ముడు పోయిన టికెట్లను బట్టి.. మొత్తం ఆచార్యకి 10,740 డాలర్లు కలెక్షన్లు నమోదయ్యాయి. ఎలాగూ బుధవారం నుంచి అన్ని ప్రాంతాల్లో టికెట్ల అమ్మకాలు మొదలు కానున్నాయి. మొత్తమ్మీద అమెరికాలో కూడా ఆచార్య హడావిడి బాగానే కనిపిస్తోంది.
ఈ సినిమాలో చిరు – చరణ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించినప్పుడు ఇద్దరి మధ్య ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అదిరిపోతుందట. అందుకే, పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా పై భారీ బజ్ ఉంది. అలాగే, చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
పైగా ‘కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్’ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. అన్నట్టు ఈ చిత్రం రన్ టైం 2 గంటల 58 నిమిషాలు. మరి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.
Also Read: Chiranjeevi Old Movie: KGF మూవీ చిరంజీవి పాత సినిమాకి రీమేక్?? బయటపడ్డ షాకింగ్ నిజాలు