Ram Charan Daughter: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన ఈరోజు ఉదయం తెల్లవారు జామున 1 గంటకు ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.రీసెంట్ గానే ఈ దంపతులిద్దరూ 11 సంవత్సరాల వైవైహిక వార్షికోత్సవాన్ని ఎంతో సంతోషం తో జరుపుకున్నారు. ఈలోపు వాళ్ళిద్దరికీ బిడ్డ పుట్టడం మెగా ఫ్యామిలీ లో చెప్పలేనంత ఆనందాన్ని తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కాసేపటి క్రితమే చిరంజీవి మీడియా తో మాట్లాడుతూ ‘ఉపాసనకు చాలా సుఖవంతమైన ప్రసవం జరిగింది.
ఆడబిడ్డ మా ఇంట్లో పుట్టడం మాకు ఎంతో అపురూపం, ఎందుకంటే 11 ఏళ్ళ నుండి రామ్ చరణ్ మరియు ఉపాసనలు ఎప్పుడు తల్లితండ్రులు అవుతారా..ఎప్పుడు మా చేతుల్లో బిడ్డని పెడుతారా అని ఎదురు చూస్తూ ఉన్నాము. ఇన్నాళ్ల మా ఎదురు చూపులకు తెరపడింది’ అంటూ చిరంజీవి కాసేపటి క్రితమే ఎమోషనల్ గా మీడియా కి చెప్పుకున్నాడు.ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ కూతురు పుట్టిన టైం మరియు తేదీని బట్టి న్యూమరాలజీ ప్రకారం ఆమె జీవితం ఎలా ఉండబోతుందో చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
న్యూమరాలజిస్ట్స్ చెప్తున్న దానిని బట్టీ చూస్తే రామ్ చరణ్ కూతురుకి 2 వ నెంబర్ బాగా కలిసి వస్తుందట. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఆగష్టు 22 ఆ తారీఖున అనే విషయం అందరికీ తెలిసిందే,అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2. ఇలా తన తాతయ్యలిద్దరీ పుట్టినరోజులు కూడా రెండవ సంఖ్య తో కలుస్తుండడం చాలా రేర్ కాంబినేషన్ అని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇక జాతక రీత్యా ఈ అమ్మాయికి తిరుగే లేదని, మెగా ఫ్యామిలీ మొత్తం గర్వపడే స్థాయికి ఎదుగుతుందని,ఈ సందర్భంగా కొంతమంది న్యూమరాలజిస్ట్స్ చెప్తున్నారు. ఇక ప్రస్తుతం ఉపాసన అపోలో హాస్పిటల్ లోనే తన పాప తో కలిసి ఉంది. ఈరోజు సాయంత్రం వరకు డాక్టర్ల అబ్సెర్వేషన్ లో ఉండాలని, నేడు సాయంత్రం కానీ, రేపు ఉదయం కానీ డిశ్చార్జి చేసే అవకాశం ఉందని అంటున్నారు.