spot_img
Homeఎంటర్టైన్మెంట్Abhishek Bachchan comments on divorce: ఐశ్వర్య రాయ్ తో విడాకుల వ్యవహారం పై అభిషేక్...

Abhishek Bachchan comments on divorce: ఐశ్వర్య రాయ్ తో విడాకుల వ్యవహారం పై అభిషేక్ బచ్చన్ హాట్ కామెంట్స్..

Abhishek Bachchan comments on divorce: ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న అభిషేక్ బచ్చన్(Abhishek Bachan), ఐశ్వర్య రాయ్(Aishwarya Rai Bachan) జంట వైవాహిక బంధం లోకి అడుగుపెట్టి దాదాపుగా 2 దశాబ్దాలు పూర్తి కాబోతున్నాయి. అయితే చాలా కాలం నుండి వీళ్లిద్దరి మధ్య అనేక మనస్పర్థలు ఏర్పడ్డాయని , ఐశ్వర్య రాయ్ తన కూతుర్ని తీసుకొని అభిషేక్ కి దూరంగా విదేశాలకు వెళ్లిపోయిందని , అక్కడే గత కొద్దినెలల నుండి ఉంటుందని , ఇలా ఎన్నో రకాల వార్తలు ప్రచారం అయ్యాయి. బాలీవుడ్ లో సినిమాల కంటే గాసిప్స్ ఎక్కువ వస్తుంటాయి. ఆ క్రమం లోనే ఈ క్రేజీ జంటపై ఇలాంటి గాసిప్స్ పుట్టాయి. అయితే రీసెంట్ గానే అభిషేక్ బచ్చన్ బాలీవుడ్ లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఐశ్వర్య రాయ్ గురించి గొప్పగా మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఆయన మాట్లాడుతూ ‘ మా మధ్య ఈగో క్లాష్ వచ్చిందని , మేమిద్దరం విడిపోతున్నామంటూ సోషల్ మీడియా లో వస్తున్న రూమర్స్ ని చూసి చాలా సార్లు నవ్వుకున్నాను. నా భార్య నాకంటే కెరీర్ లో పైకి వెళ్తే, నేను ఎంతో సంతోషిస్తాను కానీ, అభద్రతా భావానికి గురవ్వను. మా నాన్న కంటే అమ్మ పెద్ద సూపర్ స్టార్ గా కొనసాగుతున్న రోజుల్లోనే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. చిన్నతనం నుండి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమానుబంధం , ఆప్యాత చూస్తూ పెరిగాను. ఏనాడూ కూడా వాళ్ళ మధ్య ఈగో అనే పదానికి తావు లేదు. నేను కూడా వాళ్ళ నుండి అదే నేర్చుకున్నాను. కాబట్టి ఇన్నేళ్ల మా సుదీర్ఘ దాంపత్య ప్రస్థానం లో ఇలాంటి విబేధాలు ఎప్పుడు రాలేదు. నా భార్య సాధించే విజయాలు నాకు గర్వకారణం లాంటివి’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఇన్ని రోజులు వీళ్లిద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియా లో వచ్చిన వార్తలకు చెక్ పడింది.

Also Read: ప్రపంచంలోనే తొలి ఇండియన్ నటిగా నిల్చిన రష్మిక..నమోదైన అరుదైన రికార్డు..

తన కూతురు ఆరాధ్య గురించి అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ ‘మన పిల్లలకు నీతులు చెప్పడం చాలా సులువు. కానీ నేను దానికంటే మన ప్రవర్తన తో వాళ్లకు ఆదర్శంగా నిలబడడాన్ని గట్టిగా నమ్ముతాను. తల్లిదండ్రులు గొప్ప గురువులు కాకపోవచ్చు, కానీ ఉన్నతమైన విలువలు వాళ్లకు నేర్పించడం లో నేను, ఐశ్వర్య ఎప్పుడు విఫలం అవ్వలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు అభిషేక్ బచ్చన్. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. ఇకపోతే ఇన్ని రోజులు హీరో గా, సపోర్టింగ్ యాక్టర్ గా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ వచ్చిన అభిషేక్ బచ్చన్ తొలిసారి పూర్తి స్థాయి విలన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. షారుఖ్ ఖాన్ హీరో గా నటిస్తున్న ‘కింగ్’ చిత్రం లో అభిషేక్ బచ్చన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version