Aata Sandeep wife: జీ తెలుగులో ప్రసారమైన ఆట షో ద్వారా చాలా మంచి పాపులారిటీని సంపాదించుకున్న డాన్స్ మాస్టర్ సందీప్ మాస్టర్… ఆట మొదటి సీజన్ టైటిల్ గెలుచుకున్న సందీప్ మాస్టర్ ఆట సందీప్ గా ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యాడు. అలాగే పలు సినిమాలకు కూడా కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.
ఇక ఇప్పటికే ఈయన సోషల్ మీడియాలో కొత్త సాంగ్స్ కి స్టెప్పులు వేస్తూ చాలా బాగా ఫేమస్ అయ్యాడు ఎందుకంటే ఈయన ప్రతి సాంగ్ కి సంబంధించిన డ్యాన్స్ వీడియోని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు.ఇక ఇదీలా ఉంటే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్ గా వచ్చి చాలా తక్కువ టైం లోనే స్టార్ కంటెస్టెంట్ గా కూడా కొనసాగి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయినప్పటికీ టైటిల్ ఫైనల్ వరకు రాలేకపోయినా కూడా తనదైన రీతిలో ఒక బెస్ట్ కంటెస్టెంట్ అనే పేరు అయితే సంపాదించుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఆట సందీప్ ఆయన భార్య అయిన జ్యోతి రాజ్ ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు. వీళ్లిద్దరు తమదైన జోడిగా గుర్తింపును సంపాదించుకున్నారు అలాగే సోషల్ మీడియాలో ఎప్పుడూ ఇద్దరు డాన్సులు వేస్తూ వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల తను కూడా సందీప్ తో పాటు మంచి ఫేమస్ డాన్సర్ గా గుర్తింపు పొందింది. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ అసలు విషయం ఏంటి అంటే సందీప్ భార్య అయిన జ్యోతి రాజ్ తనదైన దయా గుణాన్ని చాటుకుంది. ఎందుకంటే గడిచిన 10 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన చలి ఉండటం వల్ల హైదరాబాద్ లాంటి నగరంలో ఫుట్ పాత్ మీద పడుకునే వాళ్లు చలికి చాలా ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశ్యంతో చాలామందికి రగ్గులను పంపిణీ చేసి తన దయ గుణాన్ని చాటుకుంది.
నిజానికి గత వారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎముకలు కొరికేసే చలి ఉంటుంది. దాన్ని తట్టుకోవాలంటే మాత్రం చాలా కష్టం కాబట్టి అందుకే వాళ్ల కోసం తను ముందడుగు వేసి తన వంతు సహాయం చేస్తుంది. ఇక అందరూ కూడా తనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని తమకు తోచినంత సాయాన్ని పేదలకు చేయాలని కోరుకుందాం…