Aashka Garodia : ఇండస్ట్రీలో చాలామంది యాక్టింగ్ తో పాటు, తమ సొంత వ్యాపారాలు చేసే నటీనటులు చాలామంది ఉన్నారు. స్టార్ హీరో లు, స్టార్ హీరోయిన్లు కూడా ఒకపక్క సినిమాలలో నటిస్తూనే మరోపక్క పలు వ్యాపారం లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ క్రమంలోనే అలియా భట్, దీపికా పదుకొనే, రష్మిక మందన, సమంత, ప్రియాంక చోప్రా, నయనతార, శ్రద్ధా కపూర్ వంటి తారలు సినిమాలలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తూనే మరోపక్క తమ సొంత వ్యాపారంతో బిజీగా ఉన్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దుస్తుల బ్రాండ్ గా వ్యవహరిస్తే మరి కొంత మంది బ్యూటీ ప్రొడక్ట్స్ ఉత్పత్తుల బ్రాంచ్ స్టార్ట్ చేశారు. ఇప్పటివరకు తమకు ఉన్న ఇమేజ్, స్టార్ డం తో తమ బిజినెస్ ను తామే ప్రమోట్ చేసుకుంటున్నారు. అలాగే తమ బిజినెస్ కోసం సినిమాలను వదిలిపెట్టిన హీరోయిన్లు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. తమ నటనకు గుడ్ బై చెప్పేసి పూర్తిగా తమ దృష్టి మొత్తాన్ని వ్యాపారం మీదనే పెట్టిన హీరోయిన్లు ఉన్నారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఈ కోవకు చెందిందే. ఈమె నటన రంగం నుంచి తప్పుకొని తన దృష్టి మొత్తాన్ని బిజినెస్ మీదనే పెట్టింది. ఒకప్పుడు బుల్లితెర మీద అలరించిన ఈ అమ్మడు ప్రస్తుతం 1300 కోట్లు కంపెనీకి ఓనర్ గా రాణిస్తుంది. ము ఖ్యంగా ఈమె బుల్లితెర మీద విలన్ పాత్రలలో నటించింది. ఈమె మరెవరో కాదు ఆష్కా గరోడియా. బుల్లితెర మీద పలు సీరియల్స్ లో ఈమె విలన్ పాత్రలో నటించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. కెరీర్ మంచి పీక్ లో ఉన్న సమయంలోనే నటన రంగానికి గుడ్ బై చెప్పేసి కాస్మోటిక్ వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.
2002లో ఆష్కా గరోడియా నటన రంగంలోకి అడుగు పెట్టింది. ఆచానక్ 37 సాల్ బాద్ అనే టీవీ సీరియల్ లో ఈమె తొలిసారిగా నటించింది. ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత 2019లో వ్యాపార రంగం మీద ఉన్న ఆసక్తితో టీవీ పరిశ్రమను విడిచిపెట్టింది. తన దృష్టి మొత్తాన్ని వ్యాపార రంగం మీదనే పెట్టింది. ప్రస్తుతం ఆష్కా గరోడియా 1300 కోట్ల వ్యాపారాన్ని నిర్వహిస్తుంది. ఈమె 2018లో తన ఇద్దరు స్నేహితులతో కలిసి రెనే కాస్మోటిక్స్ కంపెనీని ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కంపెనీ కోట్ల రూపాయల టర్నోవర్ కలిగి ఉందని సమాచారం.
ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ప్రముఖ కంపెనీలలో రెనే కాస్మోటిక్స్ కంపెనీ కూడా ఒకటి. 2024 నివేదికల ప్రకారం రేనే కాస్మోటిక్ బ్రాండ్ కంపెనీ ధర రూ. 1300 కోట్లకు చేరుకుందని తెలుస్తుంది. నేడు ఈమె ఒక విజయవంతమైన వ్యాపారవేత్త.ఆష్కా గరోడియా జీరో నుంచి ప్రారంభించిన వ్యాపారం ప్రస్తుతం చాలా విజయవంతం అయ్యి 1300 కోట్ల టర్నోవర్ కు చేరుకుంది. ఇలా ఆష్కా గరోడియా నటన రంగం కు గుడ్ బాయ్ చెప్పేసి వ్యాపార రంగంలో చాలా విజయవంతమైన వ్యాపారవేత్తగా ప్రస్తుతం రాణిస్తుంది.