
ఇక ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని ఆర్జీవీ సినిమా తెరకెక్కించారు. దిశ ఎన్ కౌంటర్ పేరుతో ఈ సినిమా తీయగా… దిశ తల్లిదండ్రుల అభ్యంతరం వ్యక్తం చేయడంతో … ఆశ ఎన్‌కౌంటర్ గా టైటిల్ మార్చారు. అయితే ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. దిశ సంఘటనలో యువతికి ఎదురైన సంఘటనలు, ఎన్ కౌంటర్ ప్రక్రియను ఈ ట్రైలర్ లో చూపించారు.
తన మార్క్ డైరెక్షన్ తో ఈ కధను ఆర్జీవి రూపొందించారు. కాగా దిశ సంఘటనకు ఈ స్టోరీకి ఎలాంటి సంబంధం లేదంటూ వర్మ చెప్పడం జరిగింది. ఇక ఈ సినిమా నవంబర్ 26 వ తేదీన విడుదల కానుందని ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాకు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించగా… అనురాగ్ కంచర్ల నిర్మాతగా వ్యవహరించారు. కాగా మరోవైపు ఆర్జీవి కొండా అనే మరో సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. కొండా సురేఖ దంపతుల జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.