Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కి మిస్టర్ పర్ఫెక్ట్ అని పేరు ఉంది. సహజంగా అమీర్ తన సినిమా కోసం భారీ కసరత్తులు చేస్తాడు. సినిమా కోసం ఎంత కష్టాన్నైనా పడడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ముఖ్యంగా సినిమా క్వాలిటీ విషయంలో అద్భుతమైన పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్. మరి సినిమా కోసం ప్రాణం పెట్టే ఈ హీరో నుంచి ‘లాల్‌సింగ్ చద్దా’ అనే సినిమా రాబోతుంది. అయితే, ఈ సినిమా పై కొందరు విషం చిమ్ముతున్నారు.

“లాల్ సింగ్ చద్దా” సినిమా ఈ నెల 11వ తేదీన రిలీజ్ కాబోతుంది. కాబట్టి.. అమీర్ ఫుల్ ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సినిమా జనంలోకి బాగా వెళ్తుంది. ఇది గమనించిన యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అమీర్ సినిమా పై నెగిటివ్ టాక్ ను వ్యాప్తి చేస్తున్నారు. పైగా ‘బాయ్ కాట్ లాల్ సింగ్ చడ్డా’ అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా యాంటీ ఫ్యాన్స్ ట్విట్టర్ లో వైరల్ చేస్తున్నారు.
దాంతో ఈ హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది. ఇది గమనించిన అమీర్ ఖాన్ ఓ ఈవెంట్ లో దీని గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. అమీర్ మాటల్లోనే.. ‘నా సినిమాను దయచేసి బహిష్కరించి నన్ను బాధ పెట్టొద్దు. నా సినిమాలపై ఇలాంటి ప్రచారాలు జరగడం నన్ను ఎంతగానో కలిచివేస్తోంది. ఎందుకో తెలియదు. కొందరు నేను ఈ దేశాన్ని ఇష్టపడనని నమ్ముతున్నారు. ఈ విషయంలో కూడా నాకు ఎంతో బాధ కలుగుతోంది’ అని అమీర్ బాధ పడుతూ చెప్పాడు.
మొత్తానికి అమీర్ ఖాన్ ఇలా ఎమోషనల్ అవ్వడంతో ఈ విజువల్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరోవైపు అమీర్ ఫ్యాన్స్ ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. మేము ఉండగా మీ సినిమాని ఎవరూ ఏం చేయలేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా అమీర్ ఖాన్ కి సినిమా అంటే ప్రాణం. పైగా ఈ ‘లాల్ సింగ్ చద్దా’ పాత్రకు తగిన ఆహార్యం, నటనతో ఈ మిస్టర్ పర్‌ఫెక్ట్ పర్ఫెక్ట్ అనిపించాడు.

57 ఏళ్ల వయసులో కూడా అమీర్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. అన్నట్టు ఈ హిందీ సినిమా తెలుగు వెర్షన్ కూడా రాబోతుంది. పైగా ఈ ‘లాల్‌సింగ్ చద్దా’ స్వయంగా చిరంజీవి రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు. తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు, బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇది సంచలనంగా మారింది. మొత్తానికి చిరు ఈ నిర్ణయం తీసుకోవడంతో ‘లాల్‌సింగ్ చద్దా’ పై టాలీవుడ్ లో కూడా ప్రత్యేక ఆకర్షణ నెలకొంది.
Also Read:Jayasudha Shocking Comments: జయసుధ షాకింగ్ కామెంట్స్ ఎవరి గురించి ?, వివక్ష పోవాలంటే ఏం చేయాలి ?
[…] […]
[…] […]