Mahesh Babu-Rajamouli: మహేష్ బాబు రాజమౌళి సినిమా లో బాలీవుడ్ స్టార్స్ సంఖ్య పెరిగిపోతుందా..?

నిజానికి రాజమౌళి ఒక సీరియల్ డైరెక్టర్ గా తన కెరియర్ ను స్టార్ట్ చేశాడు.అయినప్పటికీ ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా ఒక్కొక్క స్టెప్ పైకి ఎక్కుతూ ప్రస్తుతం తను వరల్డ్ లో తన స్థాయిని విస్తరింపజేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

Written By: Gopi, Updated On : April 12, 2024 3:25 pm

Aamir Khan joining the Rajamouli Mahesh Babu Film

Follow us on

Mahesh Babu-Rajamouli: దర్శకధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న రాజమౌళి తెలుగుతో పాటు పాన్ ఇండియాలో కూడా తన సత్తా చాటుకున్నాడు. ఇక ఇప్పుడు పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన మ్యాజిక్ ని రిపీట్ చేయాలని చూస్తున్నాడు. నిజానికి రాజమౌళి ఒక సీరియల్ డైరెక్టర్ గా తన కెరియర్ ను స్టార్ట్ చేశాడు.

అయినప్పటికీ ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా ఒక్కొక్క స్టెప్ పైకి ఎక్కుతూ ప్రస్తుతం తను వరల్డ్ లో తన స్థాయిని విస్తరింపజేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే మహేష్ బాబుతో ఒక భారీ అడ్వెంచర్ సినిమాని కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటికీ కూడా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శర వేగంగా జరుగుతుంది. ఇక తొందర్లోనే ఈ సినిమా సెట్స్ మీదకి తీసుకెళ్ళబోతున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ ఎక్కువ అవుతున్నారు అనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాలో విలన్ గా అమీర్ ఖాన్ అయితే బాగుంటాడని రాజమౌళి అనుకుంటున్నాడట.

రీసెంట్ గా రాజమౌళి అమీర్ ఖాన్ ను కలిసి ఆయనకి కథ కూడా చెప్పినట్టుగా వార్తలైతే వచ్చాయి. ఇక విలన్ పాత్రలో అమీర్ ఖాన్ ని తీసుకుంటే సెకండ్ హీరోయిన్ పాత్రలో దీపికా పదుకొనే ను తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆమె ఈ సినిమాలో ఒక కన్నింగ్ పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆ పాత్ర సినిమా మొత్తం కంటిన్యూ అవుతుందట. ఇప్పటిదాకా వరుసగా రొటీన్ హీరోయిన్ క్యారెక్టర్లు చేస్తూ వస్తున్న దీపిక పదుకొనే కి ఇదొక డిఫరెంట్ అటెంప్ట్ అవుతుందని ఆమె సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్నారట. ఇక ఇప్పటికే రాజమౌళి ఆమెను కూడా కలిసి ఆమెకి కథ చెప్పి ఒప్పించినట్టుగా తెలుస్తుంది.

ఇక హీరోకి హెల్ప్ చేసే ఒక క్యారెక్టర్ లో కూడా మరొక బాలీవుడ్ స్టార్ ని తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నడట. ఇలా చూసుకుంటూ వెళ్తే ఒక హీరో తప్ప మొత్తం బాలీవుడ్ వాళ్లే కనిపిస్తున్నారని తెలుగు అభిమానులు బాధపడుతున్నారు. ఎందుకంటే బాలీవుడ్ వాళ్ల డామినేషన్ కనక ఉన్నట్లయితే ఈ సినిమా మా వల్లే హిట్ అయింది. అనే ఒక గర్వంతో వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్లను వీలైనంత వరకు పక్కన పెడితే మంచిదని తెలుగు సినిమా అభిమానులందరు కోరుకుంటున్నారు… చూడాలి మరి రాజమౌళి ప్లానింగ్ ఇలా ఉందో…