కరోనా కాలంలో సినిమా థియేటర్లు మూసేసిన సమయంలో ఓటీటీకి మంచి ప్రాధాన్యత దక్కింది. ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు ప్రముఖ తెలుగు సినీ నిర్మాత అల్లు అరవింద్. ఆహా ఓటీటీ యాప్ ప్రారంభించి సరికొత్త పంథాలో వెళ్తున్నారు. ఓ వైపు సినిమాలు విడుదల చేస్తూనే.. మరోవైపు రియాలిటీ షోలూ నిర్వహిస్తున్నారు. ముద్దుగుమ్మ సమంత హోస్ట్‌గా నిర్వహించిన సామ్ జామ్ విజయమే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. మరోవైపు మంచు లక్ష్మితో వంట కార్యక్రమాన్ని కూడా రూపొందించారు. తాజాగా, నట సింహం నందమూరి బాలకృష్ణతో అన్‌స్టాపబుల్ అనే షోను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రేక్షకుల్లో ఈ షోపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇదే జోష్‌తో కలెక్షన్ కింగ్ మోహన్‌బాబుతో కూడా ఓ వెబ్‌సిరీస్ రూపొందించాలని చూస్తున్నట్లు సమాచారం.
ఈ వెబ్‌సిరీస్‌కు తమిళ స్టార్ డైరెక్టర్ కథ రాసినట్లు తెలుస్తోంది. ఇందులోని ప్రధాన పాత్రలు మోహన్‌బాబు సరిగ్గా పరిపోతారని అరవింద్, ఆయన బృందం భావించినట్లు సమాచారం. ఈ విషయంపై మోహన్‌బాబుతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నారట. ఇప్పటికే మంచు లక్ష్మి ఆహాలో షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోహన్‌బాబును ఓప్పించొచ్చనే నమ్మమంతో ఆహా బృందం ఉన్నట్లు తెలుస్తోంది.