Aadikeshava Twitter Review
Aadikeshava Twitter Review: మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెనతో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చాడు. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఉప్పెన భారీ లాభాలు పంచింది. ఈ మూవీతో కృతి శెట్టి ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. వైష్ణవ్ తేజ కి మంచి ఆరంభం లభించింది. అయితే తర్వాత నటించిన కొండపొలం, రంగ రంగ వైభవంగా చిత్రాలు నిరాశపరిచాయి. దీంతో ఆయన ఈసారి సరికొత్త జోనర్ వెతుకున్నారు. రొమాంటిక్ లవ్ నుండి మాస్ యాక్షన్ డ్రామా ఎంచుకున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కించిన ఆదికేశవ నవంబర్ 24న విడుదలైంది.
వైష్ణవ్ తేజ్ కి జంటగా శ్రీలీల నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. సూర్యదేవర నాగ వంశీ సినిమాపై హైప్ పెంచేలా కొన్ని కామెంట్స్ చేశారు. ప్రోమోలు కూడా ఆకట్టుకోగా చిత్రంపై జనాల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఆదికేశవ ప్రీమియర్స్ ఇప్పటికే ముగిశాయి. టాక్ ఎలా ఉందో చూద్దాం.
సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ అంటున్నారు. వైష్ణవ్ తేజ్ ఫైట్స్ ఇరగదీశాడు అంటున్నారు. మాస్ హీరోగా ఊచకోత కోశాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక శ్రీలీల డాన్సులు, ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. ఈ మూవీలో శ్రీలీల ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ పాటలకు డాన్సులు చేసింది. ఈ సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీలీల డాన్సులు అద్భుతం అంటున్నారు.
ఫస్ట్ హాఫ్ పర్లేదు అంటున్నారు. సినిమాలోకి కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే, మ్యూజిక్, కథ ఆకట్టుకోలేదని అంటున్నారు. రొటీన్ స్టోరీని ఆసక్తి లేని కథనంతో నడిపారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మూవీ క్లైమాక్స్ కూడా తేలిపోయిందని ఆడియన్స్ అభిప్రాయం. జీవీ ప్రకాష్ మ్యూజిక్ కి కూడా నెగిటివ్ మార్క్స్ పడుతున్నాయి. పూర్తి రివ్యూ వస్తే కానీ ఆదికేశవ టాక్ ఏంటో తెలియదు.
1st half: Some Oneliners👍, Chitrala song👍, BGM in some areas👍, sreeleela Dance and Screenpresence👍
Okayish 1st half
2nd half: Climax Action scene👍, BGM in parts👍, nothing interesting in screenplay
Below average 2nd half
Overall: Below Average
2/5
— tolly_wood_UK_US_Europe (@tolly_UK_US_EU) November 23, 2023
#Adikeshava Review: 3.5/5
Positives:👉Vaishnav Tej and Sree Leela
👉Story Screenplay Direction
👉Songs and BGM
👉Action Sequences
👉Interval Twist and Climax FightNegatives:
👉 Regular Story #Adikeshava Movie Genuine #Review | #VaishnavTej, #Sreeleela #AdikeshavaReview pic.twitter.com/rmynfp0uT7— Siva Talkies (@SivaTalkies) November 23, 2023
#Adikeshava – Outdated….. skip it
Can’t say more than this @gvprakash : Please concentrate on music @vamsi84 @SitharaEnts pic.twitter.com/GEVRtFZaqB
— B V Sai Sriram (@BvsSriram) November 23, 2023
Paata Ochi Year's Aina AA crAAze Alane Undhi 🙏🏻💥#Adikeshava movie pic.twitter.com/NxjTI87VVm
— 𝐁𝐚𝐧𝐭𝐮 𝐆𝐚𝐝𝐮ᵀᴹ 🐉 (@BantuGadu_) November 24, 2023
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Aadikeshava movie twitter review in telugu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com