https://oktelugu.com/

Aadi Sai Kumar తీస్ మార్ ఖాన్ గా రానున్న ఆది… ఫస్ట్ లుక్ రిలీజ్

Aadi Sai Kumar: ప్రేమ కావాలి, లవ్ లీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో లవర్ బాయ్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు ఆది సాయికుమార్. అయితేహ్ ఇటీవల కాలంలో ఆయన నటించిన సినిమాలన్నీ ప్రేక్షకులను అంతగా అలరించలేక పోయాయి. అయితే తాజాగా ఇప్పుడు యాక్షన్ ఎంటర్టైనర్ తో మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో ‘ తీస్ మార్ ఖాన్ ‘ గా ఫుల్ జోష్ తో మనముందుకు రాబోతున్నాడు. దర్శకుడు కళ్యాణ్ జి గోగణ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 15, 2021 / 03:09 PM IST
    Follow us on

    Aadi Sai Kumar: ప్రేమ కావాలి, లవ్ లీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో లవర్ బాయ్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు ఆది సాయికుమార్. అయితేహ్ ఇటీవల కాలంలో ఆయన నటించిన సినిమాలన్నీ ప్రేక్షకులను అంతగా అలరించలేక పోయాయి. అయితే తాజాగా ఇప్పుడు యాక్షన్ ఎంటర్టైనర్ తో మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో ‘ తీస్ మార్ ఖాన్ ‘ గా ఫుల్ జోష్ తో మనముందుకు రాబోతున్నాడు.

    దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కళ్యాణ్  డైరెక్ట్ చేసిన ” నాటకం ”  చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. విజన్ సినిమాస్ బ్యానర్ పై నాగం తిరుపతి రెడ్డి  ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాయల్ రాజ్ పుత్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుండగా ఓ కీలకమైన పాత్రలో ప్రముఖ నటుడు సునీల్ కనిపించనున్నారు.

    ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా…  బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అదే విధంగా ఈ ఫస్ట్ లుక్ లో ఆది నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో కనిపిస్తున్నాడు. సిగరెట్ కాలుస్తూ నడుస్తూ వస్తున్నట్లు ఉన్న ఈ మాస్ లుక్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక ఈ సినిమా లో స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్ర లో ఆది నటిస్తుండటం విశేషం. అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్ , పూర్ణ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.  త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.