https://oktelugu.com/

Adipurush : 5500 కిలో మీటర్లు కాలినడకన వచ్చి ‘ఆదిపురుష్’ చిత్రాన్ని చూసిన మహిళ.. ఇది నిజంగా ప్రపంచ రికార్డే!

ఒక మహిళ తమ గ్రామం లో థియేటర్స్ లేకపోతే 5500 కిలోమీటర్లు ప్రయాణం చేసి 'ఆదిపురుష్' చిత్రాన్ని చూసిందట. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం.

Written By:
  • NARESH
  • , Updated On : June 23, 2023 / 09:25 PM IST

    Adipurush

    Follow us on

    Adipurush : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆదిపురుష్’ కి నెగటివ్ టాక్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా బాలేదు అంటే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యిపోతున్నారు. థియేటర్స్ లో రీసెంట్ గానే పబ్లిక్ టాక్ లో బాగాలేదు అని చెప్పిన ఒక వ్యక్తిని ప్రభాస్ ఫ్యాన్స్ చితక బాదిన సందర్భాలను మనం చూసాము.

    చాలా మంది ఈ సినిమాని చూసిన వాళ్ళు రామాయణం ని అపహాస్యం చేసారని కామెంట్స్ చేయడం మన అందరం ఇది వరకు చూసాం. అయితే ఈ సినిమాకి సపోర్టు చేస్తున్న వాళ్ళందరూ మాత్రం రామాయణం ని డైరెక్టర్ ఓం రౌత్ తన స్టైల్ లో చూపిస్తున్నానని, సినిమా ప్రారంభం కి ముందే ఒక పెద్ద ముందుమాట గా చెప్పాడని, ఆడియన్స్ కి అందులో అభ్యంతరం పడాల్సిన అవసరం ఏముందని అన్నారు.

    ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఒక మహిళ తమ గ్రామం లో థియేటర్స్ లేకపోతే 5500 కిలోమీటర్లు ప్రయాణం చేసి ‘ఆదిపురుష్’ చిత్రాన్ని చూసిందట. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. ఒకవేళ మా సినిమా పై నెగటివ్ టాక్ నిజంగా ఉంటే, ఒక సాధారణ మహిళ ఇంత దూరం ప్రయాణం చేసి మా సినిమా ఎందుకు చూస్తుందని, కొంతమంది కుట్రదారులు కావాలని నెగటివ్ టాక్ వ్యాప్తి చేసారంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.

    ఇక పోతే ఈ చిత్రం విడుదలై నేటికీ వారం రోజులు పూర్తి అయ్యింది. ఈ వారం రోజులకు గాను ఈ సినిమా 350 కోట్ల రూపాయిల గ్రాస్ మరియు 175 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు సాధించాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. బ్రేక్ ఈవెన్ మార్కు రావాలంటే మరో 75 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేయాలట.