Sreemukhi: పిల్లిని చూసి భయపడే అమ్మాయిలున్న రోజుల్లో శ్రీముఖి ఏకంగా పులితో ఆడుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. శ్రీముఖి సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె థాయిలాండ్ లో ఉన్నారు . అలాగే మే 10న శ్రీముఖి బర్త్ డే. ఈ క్రమంలో ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ తో శ్రీముఖి థాయిలాండ్ వెళ్లారు. అందమైన దేశంలో పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు. కాగా శ్రీముఖి పులితో ఆడుకుంటున్న వీడియో వైరల్ అవుతుంది. ఫుకెట్ నగరంలో ఒక జూ ఉంది. అందులో టైగర్స్ మనుషులతో ఫ్రెండ్లీగా ఉంటాయి. ఎలాంటి హానీ తలపెట్టవు. ఈ క్రమంలో ఒక పెద్దపులిని నెమరుతూ శ్రీముఖి తన ధైర్యం ప్రదర్శించింది.
పులి చాలా ప్రమాదకర జంతువు. దానికి ఏ మాత్రం మూడ్ మారి తిక్కరేగినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కాబట్టి పులి దగ్గరకు వెళ్లాలంటే చాలా ధైర్యం కావాలి. ఆ పనిని శ్రీముఖి చాలా సులభంగా చేసింది. ఈ వీడియో శ్రీముఖి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది. నెటిజెన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. సదరు కామెంట్స్ ని శ్రీముఖి బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక శ్రీముఖి కెరీర్ పీక్స్ లో ఉంది. ఆమె యాంకర్ గా నటిగా సత్తా చాటుతున్నారు. ప్రజెంట్ బుల్లితెర మీద సందడి మొత్తం శ్రీముఖిదే. ఒకటికి నాలుగు షోలు ఆమె ఖాతాలో ఉన్నాయి. చెప్పాలంటే యాంకర్ సుమ, రష్మీ గౌతమ్ లను కూడా ఆమె వెనక్కి నెట్టారు. ఆమె క్రేజ్ పెరిగిన నేపథ్యంలో సినిమా ఆఫర్స్ విరివిగా వస్తున్నాయట. అయితే హీరోయిన్ గా సెటిల్ కావాలని కోరుకుంటున్న శ్రీముఖి ఆచితూచి ఆఫర్స్ ఒప్పుకుంటున్నారట.
కొంచెం పేరున్న నటులు, దర్శకులతో పని చేయాలని ఆశపడుతున్నారట. చిన్న చిత్రాల్లో నటించడం వలన కెరీర్ కి ఉపయోగం ఉండదనేది ఆమె ఆలోచనగా తెలుస్తుంది. అలాగే స్టార్ హీరోల చిత్రాల్లో శ్రీముఖి కీలక రోల్స్ చేస్తున్నారు. చిరంజీవి అప్ కమింగ్ మూవీ భోళా శంకర్ లో శ్రీముఖి క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉంటుందట. చిరు-శ్రీముఖి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయనే ప్రచారం జరుగుతుంది. మొత్తంగా శ్రీముఖి తెలివిగా కెరీర్ ని ప్లాన్ చేసుకుని దూసుకుపోతుంది.
View this post on Instagram