Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తొమ్మది మంది కంటెస్టెంట్స్ లో ఒకరు ఫైనలిస్ట్ గా ఎంపిక కానున్నారు. బిగ్ బాస్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారా ఈ అవకాశం ఓ కంటెస్టెంట్ కి ఇవ్వనున్నాడు. అయితే ఈ పాస్ అంత ఈజీగా దక్కదు. దీని కోసం ఓ టాస్క్ ఆడాల్సి ఉంటుంది. ‘నిప్పులే శ్వాసగా, గుండెలో ఆశగా’ పేరుతో నిర్వహిస్తున్న టాస్క్ లో గెలిచిన విజేత నామినేషన్స్ నుండి బయటపడి నేరుగా ఫైనల్ కి వెళతాడు.

ప్ర హౌస్ లో ఉన్న తొమ్మిది మంది కంటెస్టెంట్స్ లో, ఐదుగురు ఫైనల్ కి, మిగిలిన నలుగురు హౌస్ నుండి ఎలిమినేట్ కానున్నారు. గత వారం కెప్టెన్ గా ఉన్న రవి… ఆ హోదాలో ఎలిమినేషన్ నుండి తప్పుకోగా… మిగిలిన 8మంది సభ్యులు నామినేట్ అయ్యారు. వచ్చే ఆదివారం నామినేషన్స్ లో ఉన్న సభ్యులలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. సీజన్ ముగింపు దశకు చేరుతుండగా.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుపొంది, నేరుగా ఫైనల్ కి చేరే లక్కీ ఛాన్స్ ఇచ్చాడు.
గార్డెన్ ఏరియాలో ఉన్న ఫైర్ ఇంజిన్ లో సైరెన్ మోగిన ప్రతిసారి… ముందుగా వెళ్లి కూర్చున్న ఇద్దరికి హౌస్ మేట్స్ ఫోటోలను కాల్చడం, లేదా సేవ్ చేయడం చేసే అధికారం ఉంటుంది. ఫైర్ ఇంజిన్ లో ఉన్న సభ్యులను,తగు కారణాలతో మెప్పించి, తమ ఫోటో కాల్చకుండా కాపాడుకునే అవకాశం కంటెస్టెంట్స్ కి ఉంటుంది. అందరి ఫోటోలు కాల్చివేయగా.. చివరిగా మిగిలిన ఫోటోలో ఉన్న సభ్యుడు ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుపొంది, నేరుగా ఫైనల్ కి వెళతాడు.
Also Read: Megastar Chiranjeevi: ఆ సమస్యపై కలిసికట్టుగా పని చేయాలి అంటున్న మెగాస్టార్ చిరంజీవి…
కీలకమైన ఈ పాస్ కోసం ఇంటి సభ్యులు శాయశక్తులా కృషి చేయనున్నారు. ఎందుకంటే ఈ పాస్ టైటిల్ గెలవడానికి మార్గం వేస్తుంది. అలాగే టైటిల్ గెలిచినా, గెలవకున్నా… ఫైనల్ కి చేరవడం వలన మంచి రెమ్యూనరేషన్ దక్కుతుంది. అయితే ఫిజికల్ టాస్క్ కాదు, కేవలం మెంటల్ టాస్క్. కాబట్టి ఎవరు ఈ పాస్ అందుకుంటారో చూడాలి.
Also Read: Super Star Krishna: జై విఠలాచార్య పుస్తకం ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన… సూపర్ స్టార్ కృష్ణ