Star Hero: సినిమా ఇండస్ట్రీలో అవకాశం రావడమే అరుదు. కానీ వస్తే మాత్రం విడిచిపెట్టకుండా సినిమాలు చేసి స్టార్లుగా మారిన హీరోలెందరో ఉన్నారు. అవకాశాలు రాగానే కాదు.. సక్సెస్ హీరో అవడమే కాదు.. ఎంత ఎత్తుకు ఎదిగినా ఎంతో ఒబిడియంట్ గా ఉంటేనే పరిశ్రమలో ఆదరిస్తారు. అలా కింది నుంచి ఉన్నతస్థాయి వరకు ఎదిగిన హీరోలు మన టాలీవుడ్ లో చాలా మందే ఉన్నారు. ఉదాహరణకు మెగాస్టార్ చిరంజీవి సాధారణ స్థాయి నుంచి మెగాస్టార్ వరకు అయిన విషయం తెలిసిందే. ఆయనలాగే ఎంతో మంది ఇండస్ట్రీలోకి వచ్చి మంచి ప్రవర్తనతో ఉండి జీవితాన్ని చక్కబెట్టుకున్నారు. అయితే కొందరు హీరోలకు మొదటి సినిమాతోనే స్టార్ డం వస్తుంది. కానీ దానిని కాపాడుకోలేకపోతారు. తలకెక్కిన పొగరుతో ప్రవర్తించడంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో చెడ్డపేరు తెచ్చుకుంటారు. అలా ఓ హీరో కూడా అదే పని చేశాడు. ఇప్పుడు అవకాశాలు లేక ఖాళీగా కూర్చున్నాడు.

సినిమా అంటే గ్లామర్ ప్రపంచం కావచ్చు. కానీ ఇది జీవితాన్ని నేర్పుతుంది. ఒక మనిషి ఎలా ఉంటే పైకి ఎదుగుతాడనే విషయాలను చెబుతుంది. ఈ విషయాలను కొందరు గ్రహించి తమ జీవితాన్ని ఆనందమయం చేసుకున్నారు. కానీ కొందరు ఇవి తెలుసుకునేసరికే అవకాశాలు జారవిడుచుకుంటారు. ఎవరికీ ఊరికే అవకాశాలు రావు. ప్రతిభతో పాటు ఇతరులతో సన్నిహితంగా మెదగాలి. పెద్దలను గౌరవిస్తూ వారి సూచలను పాటించాలి. అప్పుడే వారి మన్ననలతో అవకాశాలు వస్తాయి.
టాలీవుడ్ కు చెందిన ఓ హీరోకు మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ దక్కింది. ఊరికే వచ్చిన ఈ పేరుతో ఆ హీరో ఆగలేకపోయాడు. తాను అప్పుడే ఇండస్ట్రీని ఏలుతున్నట్లు అనుకున్నాడు. డైరెక్టర్లు, నిర్మాతలతో మిస్ బిహేవియర్ చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా తనకు రాజకీయ పలుకుబడి ఉందంటూ విర్రవీగాడు. కొందరు నటులు అతనితో నటించాలంటే కూడా ఇష్టపడేవారు కాదు. కానీ చేసేదేమీ లేక బలవంతంగా నటించారు.

ఆ హీరో పొగరుకు గుణపాఠం అప్పుడే ఎదురైంది. అతని ప్రవర్తనకు కొందరు ఇబ్బంది పడ్డారు. దీంతో అతన్ని పక్కనపెట్టాలని . డైరెక్టర్లు, నిర్మాతలు అనుకున్నారు. అలా చేయడంతో ప్రస్తుతం ఆ హీరో చేతిలో ఒక్క సినిమా లేకుండా ఖాళీగా ఉంటున్నాడు చెరువు నీళ్లు బయటకు వెళ్లిన తరువాత మరమ్మతులు చేస్తే లాభం లేదు.. ఇప్పుడు ఆ హీరో తన తప్పును తెలుసుకొని అవకాశాల కోసం బతిమిలాడుతున్నాడు. కానీ ఎవరూ స్పందించలేదు. అయితే ఒక్క సినిమానే జీవితాన్ని మార్చదు… ఎక్కడైనా ఇతరులతో కలుపుగోలుగా మెదిలితేనే జీవితం బాగుంటుందని కొందరు నటులు సూచిస్తున్నారు.