Pawan Kalyan Birthday: సిల్వర్ స్క్రీన్ పై మెగాస్టార్ చిరంజీవి చెరగని ముద్ర వేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వంటి బడా స్టార్స్ ని ఢీ కొడుతూ నెంబర్ వన్ పొజిషన్ కైవసం చేసుకున్నాడు. దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన చిరంజీవి నట వారసుడిగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు.
నటుడు ఎలా అయ్యాడు?
పవన్ కళ్యాణ్ కి నటన పట్ల ఆసక్తి లేదు. ఆయన ఆలోచనా ధోరణి ఇతరులకు భిన్నంగా ఉండేది. సమాజం, ప్రజలు, వారి శ్రేయస్సు గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. ఒక దశలో నక్సలిజం వైపు ఆయన దృష్టి మరలింది. గన్ పట్టుకుని అడవులకు వెళ్లాలనుకున్నాడు. పవన్ కళ్యాణ్ వదిన సురేఖ భర్త చిరంజీవికి సలహా ఇచ్చిందట. కళ్యాణ్ బాబు చాలా అందంగా ఉంటాడు. హీరోగా పరిచయం చేస్తే సక్సెస్ అవుతాడని ఆమె సూచించారట.
పవన్ కళ్యాణ్ ని ఆలోచనల నుండి మళ్లించేందుకు ఇదే సరైన మార్గం అని భావించిన చిరంజీవి 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు.
నటనలో తనదైన శైలి
సాధారణంగా వారసులు తమ గాడ్ ఫాదర్స్ ని ఇమిటేట్ చేస్తారు. ఆ విధంగా జనాల్లోకి వెళ్లాలని భావిస్తారు. పవన్ కళ్యాణ్ అలా కాకుండా తనకంటూ ఓ సపరేట్ స్టైల్, మేనరిజమ్స్ క్రియేట్ చేసుకున్నాడు. ఆయన చిరంజీవి స్టైల్ ని ఎప్పుడూ ఇమిటేట్ చేయలేదు. కొన్ని చిత్రాల్లో చిరంజీవి ప్రస్తావన మాత్రం తెచ్చాడు. అన్నావదినల కోరిక మేరకు నటుడిగా మారిన పవన్ కళ్యాణ్. ఒకటి రెండు చిత్రాలు చేసి ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలని అనుకున్నాడట.
స్టార్ హీరో ఇమేజ్
సుస్వాగతం, తొలిప్రేమ, బద్రి చిత్రాలు పవన్ కళ్యాణ్ కి యూత్ లో క్రేజ్ తెచ్చాయి. ఇక 2001లో విడుదలైన ఖుషి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని పీక్స్ కి చేర్చింది. స్టార్ హీరోల లిస్ట్ లో పవన్ కళ్యాణ్ చేరారు. అత్యంత భారీ ఫ్యాన్ బేస్ కలిగిన హీరోగా ఎదిగారు. పవన్ కళ్యాణ్ ప్లాప్ సినిమాకు కూడా రికార్డు ఓపెనింగ్స్ వస్తాయి.
రాజకీయాల్లో గేమ్ ఛేంజర్
అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కోసం పవన్ కళ్యాణ్ విపరీతంగా కష్టపడ్డారు. అయితే ఆ పార్టీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. చిరంజీవి పీఆర్పీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంపై పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశాడు. 2014లో జనసేన పార్టీ స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో ఘోర ఓటమి చవి చూసిన పవన్ కళ్యాణ్ వెనకడుగు వేయలేదు.
అసాధారణమైన రాజకీయ వ్యూహాలతో ప్రత్యర్థి పార్టీని మట్టికరిపించారు. టీడీపీ, బీజేపీతో పొత్తు పై కార్యకర్తలే వ్యతిరేకత వ్యక్తం చేసినా… తన ప్రణాళికను నమ్ముకుని ముందుకు వెళ్లారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఏపీ నుండి 22 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేసింది. 100 శాతం స్ట్రైక్ రేట్ తో అన్ని స్థానాలు కైవసం చేసుకుంది. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆయన జర్నీ ఎందరికో స్ఫూర్తి దాయకం..