Rajinikanth: ‘జైలర్’ చిత్రం భారీ విజయం సాధించిన తర్వాత రజినీకాంత్ చేసిన రెండు చిత్రాలకు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాలేదు. ‘లాల్ సలాం’ చిత్రం రజినీకాంత్ నాలుగు దశాబ్దాల కెరీర్ లోనే ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు. ఇక రీసెంట్ గానే ఆయన చేసిన ‘వెట్టియాన్’ అనే చిత్రానికి కూడా అంతంత మాత్రం గానే రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 10 వ తారీఖున తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రానికి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. లాంగ్ వీకెండ్ కలిసి రావడం తో ఈ చిత్రానికి మొదటి నాలుగు రోజుల్లోనే 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఆ తర్వాత వసూళ్లు దారుణంగా పడిపోయాయి.
బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఈ చిత్రానికి 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రావాల్సిన అవసరం ఉంది. కానీ నాలుగు రోజుల తర్వాత ఈ చిత్రానికి కనీసం 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు. ఈ వీకెండ్ వచ్చే వసూళ్ల మీదనే ఈ చిత్రం భారీ గా ఆధారపడి ఉన్నది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఫుల్ రన్ లో ఈ చిత్రణకి మరో 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అదనంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్రేక్ ఈవెన్ అవ్వడం దాదాపుగా అసాధ్యం అవ్వడం తో కమర్షియల్ గా ఈ చిత్రాన్ని ఫ్లాప్ లెక్కలోకి వేయొచ్చు.అయితే ఈ చిత్రానికి ప్రీక్వెల్ ప్లాన్ చేసే పనిలో ఉన్నాడట ఆ చిత్ర దర్శకుడు జ్ఞాన్ వేల్ రాజా. రీసెంట్ గా ఆయన ఈ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొనగా, మీడియా ఈ చిత్రానికి సీక్వెల్ చేసే ప్లాన్ ఉందా అని జ్ఞాన్ వేల్ రాజా ని అడుగుతారు.
దానికి ఆయన సమాధానం చెప్తూ ‘సీక్వెల్ చేసే ఆలోచన లేదు కానీ, ప్రీక్వెల్ చేసే ఆలోచన ఉంది. కథానాయకుడు అతియాన్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అవ్వడానికి గల కారణాలు ఏమిటి?, అతను జీవితం లో ఏర్పడిన కొన్ని ప్రతికూల పరిస్థితులను ఆధారంగా చేసుకొని ఈ సినిమాని తీయాలని అనుకుంటున్నాను. అలాగే దొంగతనాలు చేసే ఫహాద్ ఫాజిల్, పోలీస్ ఇంఫార్మెర్ గా మారడానికి గల కారణాలు ఏమిటి అనేది ఈ చిత్రం లో చూపిస్తాను. అయితే ఈ సినిమాని వెంటనే ప్రారంబిస్తానా, లేదా కొన్నేళ్ల తర్వాత ప్రారంబిస్తానా అనేది నవంబర్ లో మా టీం తో చర్చి అధికారికంగా చెప్తాను. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేసే మూడ్ లో నేను, మా టీం ఉంది’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. ఈ చిత్రానికి 200 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేయబోతున్నారట.