Adhira Movie New Poster: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది టాలెంటెడ్ డైరెక్టర్లు ఉన్నప్పటికి ప్రశాంత్ వర్మ కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది… ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు చాలా తక్కువే అయినప్పటికి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. తేజ సజ్జ హీరోగా చేసిన హనుమాన్ సినిమాతో ఆయన తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్నాడు. ఆయన ప్రస్తుతం ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా కొన్ని సినిమాలను తీయాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే 6 స్టార్ హీరోలతో ఒక సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన సినిమా చేస్తున్నాడు…
ఇక ప్రస్తుతం ఆయన అధీర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇందులో ఎస్ జె సూర్య, దాసరి కళ్యాణ్ లు కలిసి నటిస్తుండడం విశేషం…
మరి ఈ పోస్టర్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. అలాగే ‘ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు వెలుగు రూపంలో ఒక ఆశా కిరణం పుట్టుకొస్తుంది’ అంటూ ఒక డైలాగ్ అయితే రిలీజ్ చేశారు. ఈ సినిమాను శరణ్ కొప్పిశెట్టి అనే దర్శకుడు డైరెక్షన్ చేస్తుండడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా ప్రశాంత్ వర్మ నుంచి ఒక సినిమా వస్తుందంటే ఆ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తి ఎదురు చూస్తూ ఉంటారు.
ఇక ఇప్పటికే ఆయన దగ్గర 20 కథలు సిద్ధంగా ఉన్నాయని ప్రశాంత్ యూనివర్స్ లో వాటిని భాగం చేస్తూ ఒక హై వోల్టేజ్ సినిమాలను చేయడానికి తను సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఏది ఏమైనా కూడా ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది…మరి పాన్ ఇండియాలో ఆయన నెంబర్ వన్ డైరెక్టర్ గా మారతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…
Very Happy to join #PVCU
When darkness blooms the world, a LIGHTNING of hope emerges ❤️Presenting @IamKalyanDasari and @iam__sjsuryah in #ADHIRA ⚡️
A NewSUPERHERO from #PrasanthVarmaCinematicUniverse
CreatedBy @prasanthvarmaofficial
@RKDStudios pic.twitter.com/nKMutxoamj— S J Suryah (@iam_SJSuryah) September 22, 2025