M. S. Narayana: సినిమా రంగం పైకి రంగుల ప్రపంచంలా కనిపిస్తుంది. కానీ నవరసాలు పండించేర నటన ఉంటేనే ఇక్కడ నిలదొక్కుకుంటారనే ఇక్కడ అనుభవం పొందిన వారు చెబుతున్నారు. ఎలాంటి పర్ఫామెన్స్ అయినా చూపించడానికి రెడీగా ఉన్నప్పుడే సినిమాల్లో అవకాశాలు వస్తాయి. చాలా మంది హీరో అవుదామనే ఇండస్ట్రీకి వస్తారు. కానీ కొందరి బాడీ లాంగ్వేజ్, వారి శైలి ఆధారంగా అనుకున్న స్థాయికి రాలేకపోతున్నారు. హీరోగానే కాకుండా వివిధ పాత్రల్లో గుర్తింపు తెచ్చుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. వారిలో ఎంఎస్ నారాయణ ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తరువాత కమెడియన్ గా గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఆయన తాగుబోతు క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవుతారు. అయితే ఆ పాత్ర చేయడానికి ఓ మెగా హీరో కారణమన్న చర్చ సాగుతోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో దిగ్గజ కమెడియన్లలో బ్రహ్మనందం, ఆలీ లు. వీరి తరువాత ఎంతో మంది కమెడియన్లు వచ్చారు. కానీ ఎవరూ పోటీ ఇవ్వలేదు. కానీ ఎంఎస్ నారాయణ తన పర్ఫామెన్స్ తో వీరికి గట్టి పోటీ ఇచ్చారు. మోహన్ బాబు పెదరాయుడు సినిమాలో గుమాస్తా క్యారెక్టర్ తో ఎంఎస్ నారాయణ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత అనతి కాలంలోనే పలు సినిమాల్లో అవకాశాలు పట్టేశారు. అయితే వాస్తవానికి ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగాలని అనుకున్నారు. కానీ అనుకోకుండా కమెడియన్ గా ఎదిగారు. అందుకు మెగా హీరో నాగబాబు అని చెప్పుకుంటున్నారు.
మెగా హీరో నాగబాబు కీలక పాత్రలో నటించిన ‘రుక్మిణీ’ మూవీ అందరికీ గుర్తుండే ఉంటుంది. వినీత్, ప్రీతీ లు కలిసి నటించిన ఈమూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్. ఇందులో ఎంఎస్ నారాయణ మొదటిసారిగా తాగుబోతు క్యారెక్టర్లో కనిపిస్తారు. అయితే ఎంఎస్ నారాయణను చూసి తాగుబోతు క్యారెక్టర్ చేయాలని సూచించారట. అలా చేస్తే అద్బుతమైన పర్ఫామెన్స్ ఉంటుందని చెప్పారట. దీంతో అప్పటి నుంచి ఎంఎస్ఎన్ తాగుబోతు క్యారెక్టర్లు బాగా చేశారు. ఇవే ఆయనకు గుర్తింపును తీసుకొచ్చాయి.
ప్రస్తుతం మన మధ్య ఎంఎస్ నారాయణ లేకున్నా ఆయన కామెడీ వీడియోలు ఇప్పటికీ అలరిస్తూ ఉంటాయి. ఆయన చనిపోయిన సంవత్సరం కూడా ఎంఎస్ నారాయణ నటించిన 11 సినిమాలు విడుదలయ్యాయి. ఎంఎస్ నారాయణ కుమారుడిని తన డైరెక్షన్లో ‘కొడుకు’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి తీసుకొచ్చినా రాణించలేకపోయారు. దీంతో ఆయన సినిమా ఇండస్ట్రీని వదిలేశారు.