Game Changer Pre Release Event: ఆర్ ఆర్ ఆర్ తో గ్లోబల్ ఫేమ్ రాబట్టిన రామ్ చరణ్ నుండి వస్తున్న గేమ్ ఛేంజర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. స్టోరీ టెల్లింగ్ లో మాస్టర్ అనిపించుకున్న శంకర్ దర్శకత్వం తెరకెక్కించిన మూవీ కావడం మరొక విశేషం. శంకర్ ఫస్ట్ టైం ఒక టాలీవుడ్ హీరోతో మూవీ చేస్తున్నాడు. గేమ్ ఛేంజర్ అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ థ్రిల్లర్. రామ్ చరణ్ రెండు భిన్నమైన పాత్రలు చేస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఆయన రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు. మరో పాత్రలో ఐఏఎస్ అధికారి అట.
నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో గేమ్ ఛేంజర్ నిర్మించారు. అనుకోని కారణాల వలన గేమ్ ఛేంజర్ షూటింగ్ సకాలంలో జరగలేదు. అలాగే డిసెంబర్ లో విడుదల చేయాల్సిన ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దించారు. చిరంజీవి నటిస్తున్న విశ్వంభర విడుదల వాయిదాపడిన నేపథ్యంలో.. ఆ తారీఖు గేమ్ ఛేంజర్ చిత్రానికి కేటాయించారు. అనగా 2025 జనవరి 10న గేమ్ ఛేంజర్ వరల్డ్ వైడ్ విడుదల కానుంది. విడుదలకు మరో ఇరవై రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ షురూ చేశారు.
డిసెంబర్ 27న గేమ్ ఛేంజర్ ట్రైలర్ విడుదల చేస్తున్నారట. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ సైతం ప్లాన్ చేస్తున్నారట. చిరంజీవిని గెస్ట్ గా అనుకుంటున్నారట. కాగా ఏపీలో ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయని తాజా సమాచారం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ని అతిథిగా ఆహ్వానించాలని ఆలోచన అట. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ టాలీవుడ్ బిగ్గెస్ట్ ఈవెంట్ గా నిలవనుందని అంటున్నారు.
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుక ఎక్కడ నిర్వహించాలి అనేది ఇంకా డిసైడ్ కాలేదట. దాదాపుగా రాజమండ్రి లేదా వైజాగ్ లో ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారట. మరి అదే జరిగితే.. మెగా ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పోటెత్తడం ఖాయం. గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్ చరణ్ కి జంటగా కియారా అద్వానీ నటిస్తుంది. అంజలి, సునీల్, ఎస్ జే సూర్య, శ్రీకాంత్ కీలక రోల్స్ చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.