Rakesh Master Biography
Rakesh Master Biography: రాకేశ్ మాస్టర్.. పరిచయం అక్కరలేని పేరు. ఆటా, ఢీ ప్రోగ్రాంల ద్వారా డ్యాన్‌స మాస్టర్‌గా వెలుగులోకి వచ్చిన రాకేశ్.. తర్వాత అనేక సినిమాలకు డ్యాన్స్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఒకప్పుడు డ్యాన్ క్లాసులు చెప్పుకుంటూ నెలకు రూ.5 వేలు, రూ.10 వేలు సంపాదించే రాకేశ్ తర్వాత గొప్ప డ్యాన్స్ మాస్టర్ అయ్యాడు. సుమారు 1,500 సినిమా పాలకు కొరియోగ్రాఫర్‌గా చేశారు. అయితే ఎంత వేగంగా ఎదిగాడో.. అంతే వేగంగా పతనమయ్యాడు రాకేశ్. చివరకు పేరు, సెలబ్రిటీ ఇమేజ్, ఆస్తులు అన్నీ పోగొట్టుకుని చివరకు అనాథలాగా గాంధీ ఆస్పత్రిలో మృతిచెందాడు. సెలబ్రీలం అని భావించే ప్రతీ ఒక్కరు రాకేశ్ మాస్టర్ జీవితాన్ని ఉదాహరణగా తీసుకోవాల్సిందే.
కష్టపడి ఎదిగి..
చిన్నతనం నుంచే డ్యాన్స్ అంటే ఇష్టం ఉండే రాకేశ్.. సినిమా పాటలకు సెప్పులేసేవాడు. తర్వాత అవకాశాల కోసం ప్రయత్నించాడు. కానీ దొరకలేదు. దీంతో డ్యాన్స్ స్కూల్ పెట్టుకుని పిల్లలకు డ్యాన్స్ నేర్పడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనూ అనేక ప్రయత్నాలు చేశాడు. నటుడు ముక్కురాజు వద్ద అసిస్టెంట్‌గా కూడా పిచేశాడు. ఈ పరిచయాల కారణంగా ఇండస్ట్రీలో అకవాశం లభించింది. మంచి స్టెప్పులతో ఇండస్ట్రీలో సక్సెస్ కావడంతో రాకేశ్ ఇక వెనక్కు తిరిగి చూసుకోలేదు.
శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఆయన శిష్యులే..
ఆటా, ఢీ ప్రోగ్రాంల ద్వారా వెలుగులోకి వచ్చిన రాకేశ్ వద్ద ప్రస్తుత ప్రముఖ కొరియోగ్రాఫర్లు శేఖర్‌మాస్టర్, జానీ మాస్టర్‌తోపాటు అనేకమంది రాకేశ్ మాస్టర్ శిష్యులే. ఆయన దగ్గర డ్యాన్స్ నేర్చుకునే నేడు ప్రముఖ కొరియోగ్రాఫర్లుగా ఎదిగారు. అయినా వాళ్లు ఎప్పుడూ రాకేశ్ మాస్టర్‌ను విస్మరించలేదు. తాము రాకేశ్ మాస్టర్ శిష్యులమే అని చెప్పుకున్నారు. ఇలా అనేక మంది డ్యాన్స్ మాస్టర్లను, కొరియోగ్రాఫర్లను తయారు చేసిన రాకేశ్ తర్వాత వివాదాస్పద వ్యాఖ్యలు, విమర్శలతో ఇండస్ట్రీలో అవకాశాలు దూరమయ్యాయి.
ప్రభుదేవ సమక్షంలోనే..
ఢీ కార్యక్రమానికి జడ్జిగా ప్రభుదేవ వచ్చినప్పుడు.. ఆయన ఇచ్చిన రిజల్ట్ నచ్చకపోవడంతో రాకేశ్ మాస్టర్.. వేదికపైనే సంచలన వ్యాఖ్యలు చేశాడు. తెలుగు షోలకు తెలుగు కొరియోగ్రాఫర్లనే జడ్జిలుగా పిలవాలని అన్నారు. ఆ తర్వాత కూడా పలు ఇంటర్వ్యూలు, యూట్యూబ్ చానెళ్లలో సెలబ్రిటీలపై విమర్శలు చేస్తూ వీడియోలు పోస్టు చేశాడు. ఈ క్రమంలో అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో చివరకు ఒంటరయ్యాడు. సెలబ్రిటీ హోదా పోయింది. ఆస్తులు కూడా కరిగిపోయాయి. చివరకు ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడికే చేరాడు. చేతిలో చిల్లి గవ్వ కూడా లేని పరిస్థితి వచ్చింది. ఇటీవల విశాఖపట్నం షూటింగ్‌కు వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. చివరకు అనాథలా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఎంతో మంది శిష్యులు, ఎన్నో సినిమాలకు కొరియోగ్రఫీ, ఎంతోమంది నిర్మాతలతో సంబంధం ఉన్నా.. చివరకు ఎవరూ తనకు ఉపయోగపడలేదు. సహకరించలేదు. సెలబ్రిటీగా ఉన్నప్పుడు ఎగిరెగిరి పడిన మాస్టర్ చివరకు అనాథలా చనిపోవాల్సి వచ్చింది. ఇది రాకేశ్‌మాస్టర్ లాంటి ఎంతోమందికి ఓ పాఠం.