Vishnu Vinyasam Release Date Update: తన కామెడీ టైమింగ్ తో యూత్ ఆడియన్స్ లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకొని, వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న హీరో శ్రీవిష్ణు(Sree Vishnu), ఈ నెల 28న ‘విష్ణు విన్యాసం'(Vishnu Vinyasam) అనే చిత్రం తో మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు. దానికి ఆడియన్స్ నుండి ఎలాంటి బ్లాస్టింగ్ రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూశాము. శ్రీ విష్ణు నుండి ఎలాంటి కామెడీ డైలాగ్స్ ని ఆశిస్తారో, అవన్నీ ఈ సినిమాలో పొందుపరిచినట్టు టీజర్ ని చూస్తేనే స్పష్టంగా అర్థం అయిపోతుంది. అయితే ఈ సినిమా విడుదలైన రోజునే, శ్రీవిష్ణు మరో చిత్రం ‘మృత్యుంజయ్’ కూడా విడుదల అవ్వబోతుండడంతో, చాలా రోజుల తర్వాత ఒక హీరోకి సంబంధించిన రెండు సినిమాలు ఒకే రోజున విడుదల అవ్వబోతున్నాయి అంటూ ప్రచారం సాగింది.
అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదల అవ్వడం లేదు. ‘విష్ణు విన్యాసం’ చిత్రం ఒక రోజు ముందుగా , అనగా ఫిబ్రవరి 27న విడుదల చెయ్యాలని ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తోంది. ఈరోజు లేదా రేపు మేకర్స్ అధికారిక ప్రకటన చేయబోతున్నారు. అయితే విడుదలయ్యే ఈ రెండు సినిమాల్లో ‘విష్ణు విన్యాసం’ చిత్రానికి మంచి క్రేజ్ ఉంది. ఎందుకంటే ఇది యూత్ ఫుల్ ఎంటర్టైనర్, శ్రీ విష్ణు మార్క్ సినిమా కాబట్టి. కానీ ‘మృత్యుంజయ్’ చిత్రం మాత్రం సీరియస్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. శ్రీవిష్ణు ని ఆడియన్స్ సీరియస్ రోల్స్ లో చూడడం కంటే, ఎంటర్టైన్మెంట్ రోల్స్ లోనే చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతారు కాబట్టి, ‘విష్ణు విన్యాసం’ కి ఉన్నంత బజ్, ‘మృత్యుంజయ్’ కి క్రియేట్ అవ్వలేదు. అయితే ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదలయ్యే పరిస్థితి రావడానికి కారణం ఓటీటీ వల్లే అని నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా లో ప్రచారమైన వార్త.
కానీ అందులో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చాడు శ్రీవిష్ణు. ఇలా జరగడానికి కారణం ఇప్పుడు కాదు, రెండు సినిమాలు విడుదల అయ్యాక చెప్తాను అంటూ చెప్పుకొచ్చాడు. అంటే ఈ రెండు మూవీస్ టీమ్స్ లో శ్రీ విష్ణు ఎదో ఒక టీం పై పూర్తిగా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. మరి అసలు ఏమి జరిగింది అనే విషయం ఆయన నోటి తోనే చెప్పాలి. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ నయన శారికా నటించింది. గతంలో ఈమె ‘ఆయ్’ వంటి సూపర్ హిట్ చిత్రం లో హీరోయిన్ గా నటించింది.