https://oktelugu.com/

Venkatesh – Rana : వెంకటేష్, రానా, నాగ చైతన్య కాంబో లో భారీ మల్టీ స్టారర్… డైరెక్టర్ ఎవరంటే..?

ఈ సినిమాలో ముగ్గురు నటిస్తున్నారు అలాగే ఇది థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది కాబట్టి ఈ సినిమా మీద అక్కినేని దగ్గుబాటి అభిమానుల్లో భారీ అంచనాలైతే ఉన్నాయి.. ఇక ఈ సినిమాకు సంబంధించిన వివరాలను తొందర్లోనే అనౌన్స్ చేయబోతున్నట్లుగా కూడా. తెలుస్తుంది...

Written By:
  • Gopi
  • , Updated On : March 15, 2024 / 08:24 AM IST
    Follow us on

    Venkatesh – Rana : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విక్టరీ వెంకటేష్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక దాంతో పాటుగా ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరై ఫ్యామిలీ హీరోగా మంచి పేరు సంపాదించుకోవడమే కాకుండా, ఫ్యామిలీ సబ్జెక్టులను ఎంచుకొని సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు.

    ఇక ఈయన తర్వాత ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన రానా కూడా విలక్షణమైన క్యారెక్టర్ లను ఎంచుకొని వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే వీళ్ళ కాంబినేషన్ లో గత సంవత్సరం ‘రానా నాయుడు’ అనే ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది. అది అడల్డ్ కంటెంట్ తో ఉండడం వల్ల వెంకటేష్ కి కొంతవరకు బ్యాడ్ నేమ్ అయితే వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ దానికి సీజన్ 2 కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మూడోవ తరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య కూడా మంచి విజయాలను అందుకుంటూ వస్తున్నాడు…ఇక ఇప్పుడు వెంకటేష్, రానా, నాగచైతన్య కాంబినేషన్ లో ఒక సినిమా కూడా రాబోతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక వెంకీ నాగచైతన్య కాంబో లో ఇప్పటికే వెంకీ మామ అనే సినిమా వచ్చింది. ఇక వీళ్ళ ముగ్గురి కాంబో లో మాత్రం ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు…

    ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఒక మంచి కథని డైరెక్టర్ తేజ రెఢీ చేసి పెట్టినట్టుగా చాలా రోజుల నుంచి వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక దానికి రానా, వెంకటేష్, నాగ చైతన్య ముగ్గురు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం తేజ రానాతో ‘రాక్షస రాజా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే వీళ్ళ కాంబోలో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాతో వెంకటేష్, రానా, నాగ చైతన్య ముగ్గురు మంచి సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నారు. అలాగే వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమాగా కూడా ఇది తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇంతకుముందు వెంకీ రానా కాంబో లో సిరీస్ వచ్చినప్పటికీ అది ఓటిటి ప్లాట్ ఫామ్ లో మాత్రమే వచ్చింది. ఇక వెంకీ నాగ చైతన్య కాంబో వెంకీ మామ వచ్చినప్పటికి దాంట్లో వీళ్లిద్దరే నటించారు. ఈ సినిమాలో ముగ్గురు నటిస్తున్నారు అలాగే ఇది థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది కాబట్టి ఈ సినిమా మీద అక్కినేని దగ్గుబాటి అభిమానుల్లో భారీ అంచనాలైతే ఉన్నాయి.. ఇక ఈ సినిమాకు సంబంధించిన వివరాలను తొందర్లోనే అనౌన్స్ చేయబోతున్నట్లుగా కూడా. తెలుస్తుంది…