
‘నీది నాది ఒకే కథ’ అనే చిన్న బడ్జెట్ సినిమాలో కొత్త ఎలిమెంట్స్ ను జోడించి మంచి హిట్ ను అందుకున్నా కూడా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ‘వేణు ఉడుగులకు కాలం కలిసి రావట్లేేదు. ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ తన రెండో చిత్రంగా రానా, సాయిపల్లవిలను హీరోహరోయిన్లుగా పెట్టి ‘విరాటపర్వం’ అనే పొలిటికల్ పీరియాడిక్ థ్రిల్లర్ ను చేస్తున్నాడు.. దాదాపు మూడు సంవత్సరాలు అయింది ఈ సినిమా మొదలై. అసలుకే ఆలస్యం అనుకుంటే.. మధ్యలో కరోనా….సరే ఇప్పుడు అన్నా షూట్ చేద్దామనుకుంటే.. రానా పెళ్లి మూడ్ లో ఇప్పట్లో డేట్స్ ఇవ్వలేనని చేతులెత్తేశాడు.
Also Read: ఆ ఛానల్ అంతు చూసేందుకు రెడీ అవుతున్న రియా చక్రవర్తి?
పైగా వచ్చే ఏడాది స్టార్టింగ్ లో కూడా ఈ సినిమా కోసం రానా డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదని.. ఇప్పటికే ఒప్పుకున్న ఓ హిందీ సినిమాతో పాటు మరో తెలుగు సినిమాకి డేట్స్ ముందుగా ఇవ్వాలనే కండీషన్ రానాకి ఉందని.. ఆ రకంగా విరాటపర్వంకు రానా భారీ గ్యాప్ ఇవ్వబోతున్నాడు. ఆ సినిమాల షూటింగ్స్ ముగిశాక.. తిరగ్గా విరాటపర్వంకు రానా వచ్చినా, అప్పుడు సాయి పల్లవి డేట్స్ దొరకని పరిస్థితి ఉందట. సాయి పల్లవి వచ్చే ఏడాది మొత్తం ఫుల్ బిజీ. ఆమె చేతిలో ఇప్పటికే ఐదు పెద్ద సినిమాలు. సో..ఆ సినిమాలను కాదు అని సాయి పల్లవి విరాటపర్వంకు డేట్స్ ఇవ్వలేదు. అంటే, దాదాపు మరో సంవత్సరం దాకా విరాటపర్వం సినిమా షూట్ లేనట్లే.
Also Read: గంగవ్వను టార్గెట్ చేస్తున్న కంటెస్టెంట్లు.. గేమ్ రసవత్తరంగా మారనుందా?
పాపం వేణు ఉడుగుల ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఇప్పటికే నాలుగేళ్లు ఈ సినిమా కోసం పెట్టాడు. ఇప్పుడు మరో ఏడాది పెట్టాల్సి వస్తోంది. చిన్న సినిమా కోసం ఒక హిట్ డైరెక్టర్ దాదాపు ఐదేళ్లు సమయం పెట్టాలి అంటే.. మాటలా. కచ్చితంగా ఆ డైరెక్టర్ కెరీర్ కి ఇది దెబ్బే. కాకపోతే సినిమాకి మాత్రం మంచి ఫీడ్ బ్యాక్ ఉంది. ఈ సినిమాలో కొత్త కోణాలతో పాటు మాస్ ఎలిమెంట్స్ కూడా చాలా ఇంట్రస్ట్ గా ఉంటాయని, ముఖ్యంగా రానా పాత్రలో పాజిటివ్ థింకింగ్ తో పాటు కొంత నెగిటివ్ యాంగిల్ కూడా ఉంటుందని.. అది సినిమా మొత్తంలోనే మెయిన్ హైలైట్ గా నిలుస్తోందని తెలుస్తోంది.