Tollywood Heroine: కొంతమంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటీలు రెండు మూడు పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఈ స్టార్ హీరోయిన్ కూడా రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంది. సినిమా ఇండస్ట్రీలో నిత్యం ఏదో ఒక నటీనటుల ప్రేమ పెళ్లిళ్ల గురించి వార్తలు ఎక్కువగా వినిపిస్తూనే ఉంటాయి. కొంతమంది ఇష్టమైన ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నారు. మరి కొంతమంది ప్రేమ దగ్గరే ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా విడాకులు చాలా కామన్ గా వినిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న చాలామంది విడాకులు తీసుకొని విడిపోయి అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు స్టార్ నటీనటులు సమంత, నాగచైతన్య, ధనుష్, జీవి ప్రకాష్ ఇక ఈ మధ్యకాలంలో జయం రవి విడాకులు తీసుకున్నట్టు ప్రకటించి ఫ్యాన్స్ కి బిగ్ షాక్ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఇద్దరు ముగ్గురిని ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. తాజాగా ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. ఈ హీరోయిన్ కు ఇప్పటివరకు మూడు పెళ్లిళ్లు జరిగాయి. ఇక ఈమె తండ్రికి కూడా ఏకంగా ఐదు పెళ్లిళ్లు అయ్యాయని సమాచారం. నిజానికి సినిమా ఇండస్ట్రీలో రెండో పెళ్లి చేసుకుంటేనే వాళ్ల గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తాయి.
అలాంటిది ఈ టాలీవుడ్ హీరోయిన్ ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని వార్తల్లో నిలిచింది. ఈ హీరోయిన్ మరెవరో కాదు తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న రాధికా శరత్ కుమార్. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధిక గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ఒకప్పుడు ఈమె ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తన నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. అప్పట్లో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ రాధిక కాంబినేషన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రాధిక తెలుగు తో పాటు తమిళ్ లో కూడా చాలా సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. సినిమాలతో పాటు రాధిక సీరియల్స్ లో కూడా నటించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ప్రస్తుతం రాధికా శరత్ కుమార్ బుల్లితెర మీద ప్రసారమయ్యే సీరియల్స్ లో తల్లి పాత్రలో నటించి ఆకట్టుకుంటున్నారు.
రాధిక తండ్రి ఎంఆర్ రాధ కూడా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో బాగా గుర్తింపు ఉన్న నటుడు. ఎం ఆర్ రాధ ఐదు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయన ప్రేమావతి, ధనలక్ష్మి, సరస్వతి, జయమ్మ లను వివాహం చేసుకున్నారు. చివరిగా ఆయన శ్రీలంక చెందిన గీత అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఈయనకు 12 మంది సంతానం ఉన్నారు. శ్రీలంక మహిళ గీతకు జన్మించిన కూతురు రాధిక. రాధికాకు నిరోషా అనే ఒక చెల్లి కూడా ఉంది. ఇది ఇలా ఉంటే హీరోయిన్ రాధిక కూడా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. రాధిక ప్రతాప్ పోతేన్ ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. రాధిక రీఛార్డ్ హర్డి నీ రెండో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు కూడా విడిపోయారు. ఇక శరత్ కుమార్ ను రాధిక పెళ్లి చేసుకున్నారు.
View this post on Instagram