Sobhita Naga Chaitanya Engagement: సమంత రూత్ ప్రభు పేరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. నాగ చైతన్య – శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ చేసుకోవడమే ఇందుకు కారణం.ఆగస్టు 8న నాగ చైతన్య, శోభిత ల ఎంగేజ్మెంట్ వేడుక ఫోటోలు నాగార్జున షేర్ చేశారు. నూతన జంటను ఆశీర్వదించాడు. ఇక నాగ చైతన్య మాజీ భార్య సమంత ఈ విషయం పై ఎలా రియాక్ట్ అవుతుంది అని నెటిజన్లు ఎదురు చూస్తున్నారు.
స్టార్ లేడీ సమంత కెరీర్ లో ఎంతో ఎత్తుకు ఎదిగింది. ఎన్నో విజయాలు సాధించింది. నేషనల్ వైడ్ గా ఫేమ్ సంపాదించుకుంది. కానీ సమంత వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. నాగ చైతన్యను 2017లో ప్రేమ వివాహం చేసుకుంది. విడాకులు తరువాత సమంత మానసికంగా కుంగిపోయింది. ఆ బాధ నుంచి కోలుకోవడానికి ఆమెకు చాలా సమయం పట్టింది. ప్రస్తుతం సమంత ఒంటరిగా ఉంటున్నారు. రెండో వివాహం చేసుకునే ఆలోచన లేనట్లే కనిపిస్తుంది.
ఈ క్రమంలో ఓ విషయం వెలుగులోకి వచ్చింది. సమంత మాదిరే దగ్గుబాటి లక్ష్మి ఒంటరిగా మిగిలిపోయింది. నాగార్జున 1984లో నిర్మాత రామానాయుడు కుమార్తె లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి నాగ చైతన్య సంతానంగా పుట్టాడు. వివాహమైన నాలుగేళ్లకు మనస్పర్థలు తలెత్తాయి. దాంతో విడాకులు తీసుకుని విడిపోయారు. విడాకుల అనంతరం దగ్గుబాటి లక్ష్మి అమెరికా వెళ్ళిపోయింది. నాగ చైతన్య తల్లి వద్దే పెరిగాడు.
సమంత-నాగ చైతన్య ఏమాయ చేసావే చిత్రంలో మొదటిసారి జతకట్టారు. 2010లో విడుదలైన ఏమాయ చేసావే సమంతకు ఫస్ట్ మూవీ. సెట్స్ లో మొదలైన పరిచయం పెళ్ళికి దారి తీసింది. 2017లో సమంత-నాగ చైతన్య వివాహం చేసుకున్నారు. హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయంలో గోవా వేదికగా వివాహం జరిగింది. పెళ్ళైన నాలుగేళ్లకు విడాకులు తీసుకుని విడిపోయారు. విడాకులు తీసుకున్న సమంత ఒంటరిగా ఉంటుంది. ఆమె జీవితం కూడా దగ్గుబాటి లక్ష్మి మాదిరి అయ్యిందనే వాదన తెరపైకి వచ్చింది.
నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల తో రిలేషన్ కొనసాగించారు. చాలా కాలం సీక్రెట్ గా ఈ జంట డేటింగ్ చేశారు.నాగ చైతన్య-శోభిత విదేశాల్లో చక్కర్లు కొడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నాగ చైతన్య – శోభిత రిలేషన్ లో ఉన్నారని సోషల్ మీడియా కోడై కూసింది. ఈ వార్తలను నాగ చైతన్య టీమ్ ఖండించారు. నిశ్చితార్థం జరుపుకుని భారీ షాక్ ఇచ్చారు.
అక్కినేని నాగార్జున అఫీషియల్ గా ప్రకటించారు. నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. తమ కుటుంబంలోకి నూతన సభ్యురాలికి వెల్కమ్. నాగ చైతన్య-శోభిత కలకాలం సుఖసంతోషాలతో కలిసి ఉండాలని నాగార్జున ట్విట్టర్ ఎక్స్ లో రాసుకొచ్చాడు. గతంలో సమంత గడచిన మూడేళ్లు చాలా కఠినంగా గడిచాయి. ఇకపై అలాంటి రోజులు నా జీవితంలోకి రాకూడదు అని కోరుకుంటున్నాను, అన్నారు. ఆమె మాటలను పరిశీలిస్తే మరో వివాహం చేసుకుంటుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి.
సమంత కెరీర్ పరిశీలిస్తే ఆమె నటించిన హనీ బన్నీ వెబ్ సిరీస్ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. అలాగే మా ఇంటి బంగారం టైటిల్ తో ఒక చిత్రం ప్రకటించింది. ఈ చిత్రాన్ని సమంత స్వయంగా నిర్మిస్తుంది. స్టార్ హీరోయిన్ గా సమంత అనేక విజయాలు నమోదు చేసింది. సమంతకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
Web Title: A bad sentiment haunted samantha as naga chaitanya wife
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com