Tollywood Actors: ఒక్కో సినిమాకి కొన్ని కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటారు మన హీరోహీరోయిన్లు. కానీ, కొన్ని సార్లు ఇష్టం లేకపోయినా తీసుకున్న డబ్బులను తిరిగి ఇచ్చేయాల్సి వస్తోంది. చేసిన సినిమా ఫ్లాప్ అయ్యి నిర్మాతలకు నష్టం వస్తే.. హీరోహీరోయిన్లు తమ రెమ్యూనరేషన్ లో బ్యాలెన్స్ తిరిగి తీసుకోకపోవటమో, లేక తీసుకున్న రెమ్యూనరేషన్ లో నుండి కొంచెం డబ్బు తిరిగి చేయడం లాంటివి చేస్తుంటారు.
ఇలా మన టాలీవుడ్ లో ఫ్లాప్ తరువాత నిర్మాతలకు తమ రెమ్యునరేషన్ ను వెనక్కి ఇచ్చిన వారి లిస్ట్ చాలా పెద్దదే ఉంది. మరి వాళ్ళెవరో చూద్దామా ?
1. ఖలేజా సినిమా ఫ్లాప్ తర్వాత మహేష్ బాబు తన రెమ్యూనరేషన్ లో సగం నిర్మాతకు తిరిగి ఇచ్చేశాడు.
2. జానీ & పులి ఫ్లాప్‌ల తర్వాత పవన్ కళ్యాణ్ కూడా తన పారితోషికాన్ని నిర్మాతలకు 40 శాతం తిరిగి ఇచ్చాడు
3. ఆరెంజ్ ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ తన పారితోషికాన్ని నిర్మాతకు 30 శాతం తిరిగి ఇచ్చేశాడు
4. నరసింహుడు ఫ్లాప్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా తన రెమ్యూనరేషన్ లో సగం నిర్మాతకు తిరిగి ఇచ్చాడు
5. అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ తన రెమ్యూనరేషన్ లో 20 శాతం నిర్మాతకు తిరిగి ఇచ్చాడు
6. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ స్లో రన్ తర్వాత బాక్సాఫీస్ వద్ద తగినంత వసూళ్లు రాబట్టలేకపోయింది. దాంతో బాలకృష్ణ తన రెమ్యూనరేషన్‌లో సగం మాత్రమే తీసుకున్నాడు.
Also Read: రాధేశ్యామ్ సహా సంక్రాంతికి వస్తున్న సినిమాలు ఇవే..
7. వినయవిధేయరామ డిజాస్టర్ తరవాత దానయ్య & రామ్ చరణ్ డిస్ట్రిబ్యూటర్లకు 5 కోట్లు తిరిగి ఇచ్చారు.
8. సాయి పల్లవి కూడా పడి పడి లేచే మనసు సినిమా ప్లాప్ తర్వాత తన రెమ్యూనరేషన్ మొత్తాన్ని నిర్మాతలకు తిరిగి ఇచ్చింది
Also Read: బాలయ్య అన్ స్టాపబుల్ షో కి రానున్న ఆ హీరో… ఎవరో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా!