83 Trailer Talk: భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికి మర్చిపోలేని సంవత్సరం అంటూ ఏదైనా ఉంది అంటే.. అది 1983 మాత్రమే. ఆ ఏడాది సువర్ణాధ్యాయంగా చరిత్రలో మరియు భవిష్యత్తులో కూడా శాశ్వతంగా నిలిచిపోతుంది. అవును, ప్రపంచ క్రికెట్ కి కొత్త ఛాంపియన్స్ ను పరిచయం చేసిన సంవత్సరం అది. నిజానికి ఇండియాలో ఇప్పుడు క్రికెట్ కి ఉన్న ఆదరణ మరో గేమ్ కి లేదు. కానీ.. మీకు తెలుసా ? 1983కి ముందు ఇండియాలో క్రికెట్ కి గొప్ప ఆదరణ ఏమి లేదు.
కానీ 1983 నుంచి ఇండియాలో క్రికెట్ పై ప్రేమ, ఆదరణ రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. అలాగే క్రికెట్ చుట్టూ జనంతో పాటు కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడి కూడా తిరగడానికి ముఖ్య కారణం కపిల్ దళం. ఈ జనరేషన్ కి కపిల్ దళం తెలియకపోవచ్చు. కానీ ఇండియా వాళ్ళను మర్చిపోలేదు. క్రికెట్ దేవుడు సచిన్ అని ఈ తరం గొప్పలు పోవచ్చు.
అయితే, ఆ దేవుడికి ఓనమాలు నేర్పించిన గురువులు కపుల్ దళంలో ముఖ్యలు అన్న విషయం చరిత్ర ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది. ఏది ఏమైనా 1983 చేసిన అద్భుతం.. ఇప్పుడు వెండితెర పై బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయడానికి రాబోతుంది. 1983లో వరల్డ్ కప్ మనకు అంత ఈజీగా రాలేదు. ఎన్నో అవమానాలు, అనుమానాలు, వైఫల్యాలు తర్వాతే కప్ వచ్చింది.
Also Read: Payal Rajput: లోదుస్తులతో అరాచకం.. అవకాశాల కోసమేనా ఈ బరి తెగింపు !
అసలు కపిల్ టీమ్ ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తుందా ? ఇది ముందు జర్నలిస్ట్ ల అడిగిన ప్రశ్న. నిజానికి ఈ ప్రశ్న జర్నలిస్ట్ లది కాదు, ప్రజలదే. అలాంటి హేళనల మధ్యన కపిల్ దళం తమ ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అయితే, ఇక్కడ ఓ విచిత్రమైన సంఘటన కూడా జరిగింది . కపిల్ టీమ్ కోసం హోటెల్స్ నుంచి గ్రౌండ్ కి వెళ్ళడానికి సరైన బస్సులు కూడా ఇవ్వలేదు.
కప్ మేం సాధిస్తాం అనగానే మీడియా కూడా పెద్దగా నవ్వింది. కానీ, కపిల్ దళం 1983లో కప్ గెలిచింది, అయితే కప్ మాత్రమే కాదు, ప్రపంచ క్రికెట్ ప్రేమికుల హృదయాల్ని కూడా సగర్వంగా గౌరవంగా గెలుచుకుంది. ఇప్పుడు అప్పటి సంగతులన్నీ.. రణవీర్ సింగ్ హీరోగా రాబోతున్న 83 అనే సినిమాలో చూపించబోతున్నారు. డిసెంబరు 24న రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయి బాగా ఆకట్టుకుంటుంది.
Also Read: Pushpa: పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా ప్రభాస్?