OG Movie Fight Scenes: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు, మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘ఓజీ'(They Call Him OG) చిత్రం మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఏది బయటకు వచ్చిన నిమిషాల వ్యవధిలో వైరల్ అయిపోవడం, ఆడియన్స్ కి అది తెగ నచ్చేయడం వంటివి జరుగుతున్నాయి. కానీ కంటెంట్ ఇప్పటి వరకు మిగిలిన సినిమాల తో పోలిస్తే చాలా అంటే చాలా తక్కువ విడుదల చేశారు. మరో నాలుగు రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకొని థియేట్రికల్ ట్రైలర్ ఇంకా రాలేదంటేనే అర్థం చేసుకోవచ్చు, మేకర్స్ ఈ చిత్రం కంటెంట్ విషయం లో ఎంతటి సర్ప్రైజ్ ని మైంటైన్ చేస్తూ వస్తున్నారు అనేది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తిరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. అవేంటో చూద్దాం.
ఈ చిత్రం ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కలుపుకొని దాదాపుగా 8 యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని, అవి అద్భుతంగా వచ్చాయని, ఫ్యాన్స్ కి విజువల్ ఫీస్ట్ లాగా ఉంటుందని అంటున్నారు. అంతే కాకుండా ఈ సినిమా కథ మొత్తం ఒక స్త్రీ చుట్టూ తిరుగుతుందని, ఆమెని విలన్ గ్యాంగ్ కిడ్నాప్ చేయడం దగ్గర నుండి స్టోరీ మొదలు అవుతుందని అంటున్నారు. ఇది పూర్తి స్థాయి యాక్షన్ చిత్రం అనుకుంటే పెద్ద పొరపాటే, యాక్షన్ తో పాటు బోలెడంత ఎమోషన్స్ కూడా ఈ చిత్రం లో ఉంటాయట. యాక్షన్ + ఎమోషన్ పర్ఫెక్ట్ గా మిక్స్ అయితే ఫలితాలు ఎలా ఉంటాయో మనం KGF సిరీస్ చూసి తెలుసుకున్నాం. కన్నడ సినీ ఇండస్ట్రీ కి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని తెచ్చి పెట్టిందంటే ఈ సినిమా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఓజీ కూడా అలా క్లిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇందులో పవన్ కళ్యాణ్ లుక్స్, స్టైలింగ్, స్వాగ్ మరియు యాటిట్యూడ్ ని చూసి అభిమానులు మెంటలెక్కిపోతారని అంటున్నారు. ఇంత అద్భుతంగా ఈమధ్య కాలం లో పవన్ కళ్యాణ్ ని ఎవ్వరూ చూపించలేదని, ఆ క్రెడిట్ డైరెక్టర్ సుజీత్ కి మాత్రమే దక్కిందని, ఈ సినిమా ఆడియన్స్ కి ఆయన కోరుకున్న విధంగా రీచ్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆకాశమే హద్దు అనే రేంజ్ వసూళ్లు వస్తాయని అంటున్నారు. అయితే ఈ సినిమాలో స్టోరీ మాత్రం వీక్ గానే ఉంటుందట. కానీ టేకింగ్, స్క్రీన్ ప్లే మాత్రం వేరే లెవెల్ లో ఉంటుందట. ఈమధ్య సూపర్ హిట్ అయిన సినిమాల్లో స్టోరీలు గొప్పగా ఏమి లేవు. కేవలం స్క్రీన్ ప్లే మీదనే నడిచాయి. ఓజీ కూడా అలాగే ఉండబోతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు చిరకాలం గుర్తించుకోదగ్గ సినిమా గా చెప్తున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అంచనాలకు తగ్గట్టుగా ఆడుతుందా లేదా అనేది చూడాలి.