Sr NTR Pan world Movie: మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ సత్తా మగధీర మరియు బాహుబలి వంటి సినిమాల ద్వారా ప్రపంచం నలుమూలల తెలిసింది అని మనం అనుకుంటూ ఉంటాము..అది వాస్తవమే..కానీ 70 ఏళ్ళ క్రితమే స్వర్గీయ శ్రీ నందమూరి నందమూరి తారకరామారావు గారు నటించిన ఒక చిత్రం లో చైనా వంటి దేశాలలో వంద రోజులు ఆడి తెలుగు సినిమా సత్తా ని ఆ రోజుల్లోనే అందరికి అర్థం అయ్యేలా చేసింది అనే విషయం ఎవరికీ తెలియదు..ఎన్టీఆర్ హీరో గా , భానుమతి గారు హీరోయిన్ గా BN రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన మల్లీశ్వరి చిత్రం అప్పట్లో ఒక ప్రభంజనం సృష్టించింది..ఈ సినిమాని BN రెడ్డి గారు అప్పట్లోనే పాన్ ఇండియా లెవెల్ లో అన్ని బాషలలో విడుదల చేసారు..విడుదలైన అన్ని బాషలలో కూడా ఈ సినిమా ఘన విజయం సాధించడం విశేషం..అప్పట్లో ఎన్టీఆర్ గారికి భానుమతి గారికి వృత్తిపరంగా చాలా విభేదాలు ఉండేవట..భానుమతి గారితో కలిసి సినిమాలో నటించడానికి ఎన్టీఆర్ అసలు ఇష్టపడేవాడే కాదట..కానీ ఈ పాత్రకి ఆమె మాత్రమే సరిపోతుందని..ఇది పాన్ ఇండియా లెవెల్ లో తియ్యాలనుకుంటున్నాని, దయచేసి ఈ ఒక్క సినిమాకి సర్దుకో అని BN రెడ్డి గారు ఎన్టీఆర్ ని ఒప్పించడం తో ఈ సినిమా పట్టాలెక్కి ప్రభంజనం సృష్టించింది.
Also Read: Groom died: పెళ్లి మండపంపై వరుడిని మృత్యువు ఎలా కబళించిందో తెలుసా? వైరల్ వీడియో
అప్పట్లో ఈ సినిమా చైనా బాషా లో కూడా అనువాదం అయ్యింది..అక్కడ పది కేంద్రాల్లో ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం..ఇటీవల కాలం లో మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుండి దంగల్, బాహుబలి 2 మరియు సీక్రెట్ సూపర్ స్టార్ వంటి సినిమాలు చైనా లో విడుదలయ్యాయి..వీటిల్లో అమిర్ ఖాన్ నటించిన దంగల్ మరియు సీక్రెట్ సూపర్ స్టార్ చైనా దేశం లో ప్రభంజనం సృష్టించాయి..ఇక బాహుబలి పార్ట్ 2 సినిమా మాత్రం చైనా లో యావరేజి గా ఆడింది..ఇప్పుడు అతి త్వరలోనే రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం చైనా మరియు జపాన్ దేశాల్లో విడుదల కాబోతుంది..టెక్నాలజీ బాగా డెవలప్ అయినా తర్వాత చైనా వంటి దేశాల్లో మన సినిమాలు విడుదల చెయ్యడం వేరు..బ్లాక్ అండ్ వైట్ సినిమాలు నడుస్తున్న కాలం లో ఇలాంటి ఫీట్ చెయ్యడం వేరు..అలా అన్నగారు 70 ఏళ్ళ క్రితమే మన తెలుగోడి సత్తాని తన సినిమా ద్వారా ఇతర దేశాల్లో చాటి శబాష్ అనిపించుకున్నాడు.
Also Read: Radhika Apte Viral Comments: పొడుగ్గా ఉంటే నచ్చదట.. భర్తపై రాధిక ఆప్టే కామెంట్స్ వైరల్
Recommended Videos