Bigg Boss 9 Telugu: ఈ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) సీజన్ మొదలై 5 వారాలు పూర్తి అయ్యింది. ఇన్ని వారాలు జరిగిన నామినేషన్స్ ఒక ఎత్తు, నేడు జరగబోయే నామినేషన్స్ మరో ఎత్తు. ఎందుకంటే హోస్ట్ అక్కినేని నాగార్జున శని, ఆదివారం ఎపిసోడ్స్ లో బంధాల మధ్య చిక్కుకున్న కొంతమంది కంటెస్టెంట్స్ ని బ్రేక్ చేసే ప్రయత్నం చేసాడు. ఆ కారణం చేత నిన్న ఎపిసోడ్ చివర్లో టెలికాస్ట్ చేసిన ప్రోమో లో తనూజ తనతో బాగా క్లోజ్ గా ఉన్నటువంటి సుమన్ శెట్టి ని నామినేట్ చేయడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఎంతసేపు నేనే మీ దగ్గరకు వచ్చి మాట్లాడడమే తప్ప, మీకు మీరుగా ఎప్పుడూ వచ్చి నాతో మాట్లాడలేదు అంటూ సిల్లీ పాయింట్ తో సుమన్ శెట్టి ని నామినేట్ చేసింది. దీనికి సుమన్ శెట్టి కూడా చాలా ఫైర్ అయ్యాడు.
అతని కోపం లో కూడా అర్థం ఉంది. ఎందుకంటే ఈ హౌస్ లో ఆయన క్లోజ్ గా ఉండేవారిలో ఒకరు తనూజ. ఆమెతో కలిసి ఈయన ఎన్నో స్కిట్స్ వేసాడు, ఇద్దరు కలిసి సరదాగా చిన్న పిల్లలు లాగా ఎన్నో ఆటలు కూడా ఆడారు. అలాంటి వ్యక్తిని తనూజ నామినేట్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఓవరాల్ గా ఈ నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయ్యాక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళడానికి నామినేట్ అయిన ఇంటి సభ్యులు తనూజ, భరణి, దివ్య నిఖిత, రాము రాథోడ్, డిమోన్ పవన్, సుమన్ శెట్టి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే దివ్య నిఖిత కి వీరిలో అందరికంటే తక్కువ ఓటింగ్ పడే అవకాశం ఉంది. తనూజ, సుమన్ శెట్టి మరియు భరణి కి సేఫ్ జోన్ లో ఉన్నట్టే. మిగిలిన ముగ్గురు డేంజర్ జోన్. సింగల్ ఎలిమినేషన్ పెడితే దివ్య నిఖిత ఎలిమినేట్ అవుతుంది, డబుల్ ఎలిమినేషన్ పెడితే డిమోన్ పవన్ ఎలిమినేట్ అవ్వొచ్చు.
ఈ నామినేషన్స్ ప్రక్రియ నుండి వైల్డ్ కార్డ్స్ సేఫ్. ఇంతకీ ఈ ప్రక్రియ ఎలా జరిగిందంటే, ఒక పైప్ లో నుండి బాల్ క్రిందకు పడుతుంది. దానిని వైల్డ్ కార్డ్స్ పట్టుకొని, పాత కంటెస్టెంట్స్ లో ఎవరికో ఒకరికి ఇచ్చే నామినేషన్ చేసే అవకాశం ఇవ్వాలి. అవకాశం పొందిన కంటెస్టెంట్ ఇద్దరినీ నామినేట్ చేస్తారు. వాళ్ళు నామినేట్ చేసిన ఇద్దరిలో,బాల్ ఇచ్చిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్ ఒకరిని నామినేషన్స్ నుండి సేవ్ చేస్తారు. ఇలా ఈ ప్రక్రియ పూర్తి అయ్యింది. హౌస్ మేట్స్ అత్యధిక శాతం భరణి ని టార్గెట్ చేసినట్టు అనిపించింది. నిన్న నాగార్జున నుండి, అక్కడికి వచ్చిన ఆడియన్స్ నుండి, వైల్డ్ కార్డ్స్ నుండి భరణి కి స్పష్టమైన ఇన్ పుట్స్ వచ్చాయి. మరి ఆయన చిక్కుకున్న బాధల నుండి విముక్తుడు అవుతాడా లేదా అనేది చూడాలి.