Junior NTR Birthday: టాలీవుడ్ లో నేటి తరం బిగ్గెస్ట్ మాస్ హీరో ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు మానవుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఆ మహానుభావుడి పేరు ప్రఖ్యాతలు ప్రపంచం నలుమూలల చాటి చెప్పింది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. కెరీర్ ప్రారంభం లో ఎన్టీఆర్ లుక్స్ చూసి ఇతను హీరో ఏమిటి అనుకున్నారు.
దర్శక ధీరుడు రాజమౌళి సైతం స్టూడెంట్ నెంబర్ 1 సినిమా సమయం లో ఇలాంటి హీరో తో పని చెయ్యాల్సి వస్తుందే అని అనుకున్నానని, అతనితో పని చేసిన తర్వాత చేస్తే ఇలాంటి హీరో తోనే చెయ్యాలి అనిపించింది అని పలు ఇంటర్వ్యూస్ లో చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. 17 సంవత్సరాలకు హీరో గా సినిమా చేసిన ఎన్టీఆర్ 19 ఏళ్లకు ఇండస్ట్రీ లో తిరుగులేని మాస్ హీరో గా ఎదిగాడు.
ఇండస్ట్రీ కి వచ్చిన అతి తక్కువ సమయం లో ఇంత చిన్న వయస్సు లో ఈ రేంజ్ కి ఎదిగిన హీరో ని మనం ఎక్కడా కూడా చూసి ఉండము, ఆ ఘనత ఎన్టీఆర్ కి మాత్రమే దక్కింది. తాత పేరు చెప్పుకొని ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ మొదటి సినిమాతోనే ఎన్టీఆర్ కి నందమూరి ఫ్యాన్స్ సపోర్ట్ వచేయలేదు. ఆయన మొదటి సినిమా ‘నిన్ను చూడాలని’ కి కేవలం 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.
ఆ స్థాయి నుండి నేడు కోట్లాది మంది అభిమానులను సంపాదించిన హీరో గా ఎదిగి, #RRR చిత్రం తో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కేవలం ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన హీరో కాదు, ప్రపంచం లో ఉన్న ప్రతీ డైరెక్టర్ అవసరమైన యాక్టర్. రాబొయ్యే రోజుల్లో ఈ చిచ్చర పిడుగు ఇంకెన్ని రికార్డులను సృష్టిస్తాడో చూడాలి.