https://oktelugu.com/

Sony TV: హద్దులు దాటిన బుల్లితెర వినోదం.. చిన్నపిల్లలతో సిగ్గులేని ప్రశ్నలు

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, కొరియోగ్రాఫర్ గీతా కపూర్, నిర్మాత అనురాగ్ బసు లు జడ్జీలుగా వ్యవహరించిన ఈ షో ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. దీనికి కారణం చిన్న పిల్లలు అని కూడా చూడకుండా సెక్సవల్ రిలేటెడ్ ప్రశ్నలు అడగడమే కారణం. ఈ షోలో పాల్గొన్న చిన్నారులను, అతని తల్లిదండ్రులను ఉద్దేశించి వెలికి కామెంట్స్ చేస్తూ జడ్జీలు నవ్వుకుంటున్నారని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

Written By:
  • Shiva
  • , Updated On : July 27, 2023 10:36 am
    Sony TV

    Sony TV

    Follow us on

    Sony TV: వినోదం పేరుతో కొన్ని షో లు చాలా దారుణమైన రీతిలో వ్యవహరిస్తున్నాయి. దానినే కామెడీ అనుకోండి అంటూ జనాలకు చూపిస్తున్నాయి. సరేలే పెద్ద వాళ్ళతో చేస్తున్నారు కదా సర్దుకోవాలి అనుకునే లోపే, పాపం పుణ్యం తెలియని చిన్నారులను సైతం ఈ వికృత క్రీడ లో భాగం చేస్తున్నారు. సోనీ పిక్చర్ నెట్వర్క్ లో ప్రసారమైన సూపర్ డాన్స్ చాప్టర్ 3 లో చిన్న పిల్లలను, వారి తల్లిదండ్రులను చిలిపి ప్రశ్నలు వేస్తూ ఆడియన్స్ నవ్విస్తూ ఉంటారు.

    బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, కొరియోగ్రాఫర్ గీతా కపూర్, నిర్మాత అనురాగ్ బసు లు జడ్జీలుగా వ్యవహరించిన ఈ షో ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. దీనికి కారణం చిన్న పిల్లలు అని కూడా చూడకుండా సెక్సవల్ రిలేటెడ్ ప్రశ్నలు అడగడమే కారణం. ఈ షోలో పాల్గొన్న చిన్నారులను, అతని తల్లిదండ్రులను ఉద్దేశించి వెలికి కామెంట్స్ చేస్తూ జడ్జీలు నవ్వుకుంటున్నారని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

    నిజానికి ఈ షోను ఏప్రిల్ 2019 నుండి జూన్ 2019 మధ్య టెలికాస్ట్ చేశారు. తాజాగా ఆ షో కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వివాదం రాజుకుంది. పైగా ఈ వీడియో అన్ని వయస్సుల వారికీ నెట్ లో అందుబాటులో ఉండటంతో దీనిపై మరిన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఇందులో ఒక చిన్నారిని ఉద్దేశించి జడ్జి అండర్ వేర్ కి సంబంధించిన ప్రశ్నలు అడగటం తో ఆ చిన్నారి చెప్పిన సమాధానం విని అందరు షాక్ అవుతారు. అయితే అంతటితో దానిని వదిలిపెట్టని జడ్జిలు మళ్ళీ మళ్ళీ అడగటంతో చివరికి పిల్లాడి తండ్రి కూడా చాలా ఇబ్బంది పడినట్లు వీడియో లో అర్ధం అవుతుంది.

    దీంతో ఈ వీడియో లోని జడ్జిల మీద మండిపడుతున్న నెటిజన్లు ” చిన్న పిల్లలను ఇలాంటి ప్రశ్నలా అడిగేది.. మీకు కొంచమైనా సిగ్గు ఉందా ” అని ఒకరు, ” ఇది చాలా అసహ్యం గా ఉందని, వినోదం పేరు చెప్పి చిన్న పిల్లలతో ఇలాంటివి చేస్తారా” అంటూ మరొకరు ఫైర్ అవుతున్నారు. కాగా జువైనల్ జస్టిస్ చట్టంలోని నిబంధనలు ఈ ఛానల్ అతిక్రమించిందని ఎన్సీపీసీఆర్ పేర్కొంది. చైల్డ్ ఆర్టిస్ట్ కు ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడిగారో వివరణ ఇవ్వాలని కోరింది. నోటీసులు అందిన 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఎన్సీపీసీఆర్ ఆదేశించింది.