Homeఎంటర్టైన్మెంట్Puneet Rajkumar: పునీత్ రాజ్ కుమార్'కు నివాళి గా 5 సినిమాలు...

Puneet Rajkumar: పునీత్ రాజ్ కుమార్’కు నివాళి గా 5 సినిమాలు ఫ్రీ – అమెజాన్ ప్రైమ్

Puneet Rajkumar: కన్నడ పవర్ స్టార్ దివంగత పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం ప్రేక్షక హృదయాలను నేటికీ కలిచివేస్తూనే ఉంది. తోటి సినీ తారల మనసులను ఇప్పటికీ బాధతో కప్పేసే ఉంది. అయితే, దివంగత పునీత్ రాజ్ కుమార్‌ కు ఘన నివాళి ఇచ్చేందుకు అమెజాన్ ప్రైమ్ సిద్ధమైంది. పునీత్ నటించి, నిర్మించిన ఐదు సినిమాలను.. అభిమానులు ఉచితంగా చూసే అవకాశం కల్పించింది అమెజాన్ ప్రైమ్ సంస్థ.

Puneet Rajkumar
Puneet Rajkumar

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి – 28వ తేదీ వరకు పునీత్ సినిమాలను ప్రైమ్‌ లో ఉచితంగా చూడొచ్చని సంస్థ పేర్కొంది. అలానే పునీత్ నిర్మాణ సంస్థ రూపొందిస్తున్న 3 కొత్త సినిమాలు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ‘వన్ కట్ టూ కట్’, ‘ఫ్యామిలీ ప్యాక్’ కూడా తమ ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు అమెజాన్ ప్రైమ్ తెలిపింది. మొత్తానికి పునీత్ కు అమెజాన్ ప్రైమ్ సంస్థ ఘన నివాళి గా ఫ్రీగా 5 సినిమాలను చూపించడం గొప్ప విషయం.

Also Read: హైదరాబాద్‌కు వ‌స్తున్న మరో టాప్ కంపెనీ.. రూ.20 వేల కోట్ల పెట్టుబ‌డులు!

కన్నడ పవర్ స్టార్ గా పునీత్ రాజ్ కుమార్ ఎదిగి, తన తండ్రి రాజ్ కుమార్ కి నిజమైన వారసుడిగా కన్నడనాట గొప్ప స్టార్ డమ్ సంపాదించాడు. అయితే, కన్నడ పవర్ స్టార్ గా మారడానికి పునీత్ జీవితం క్రమశిక్షణతో సాగింది. అందుకే, పునీత్ రాజ్‌కుమార్ కన్నడ ఇండస్ట్రీలోనే పవర్ స్టార్‌ గా నెంబర్ వన్ హీరోగా కొనసాగారు. అన్నిటికి మించి కన్నడ ఇండస్ట్రీలో డ్యాన్స్ లను, ఫైట్స్ లను ఓ స్థాయికి తీసుకు వెళ్లిన ఘనత పునీత్ రాజ్ కుమార్ కే దక్కింది.

Puneet Rajkumar
Puneet Rajkumar

కన్నడలో ఈ జనరేషన్ హీరోల్లో పునీత పేరిట ఉన్న రికార్డ్స్ మరో హీరోకి లేవు. పునీత్ పేరిట నాలుగు కన్నడ ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. పైగా పునీత్ నటించిన అప్పు, నట సార్వభౌమ, మైత్రి, పవర్ ఈ నాలుగు చిత్రాలు కన్నడలో గొప్ప చిత్రాలుగా నిలిచిపోయాయి. ఇక పునీత్ తెలుగు నటులు అన్నా, తెలుగు టెక్నీషియన్స్ అన్నా ఎంతో గౌరవంగా చూసేవాడు.

ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ను తన సొంత తమ్ముడిలా పునీత్ ఫీల్ అయ్యేవాడు. ఇక పునీత్ కెరీర్ లో మరో గొప్ప విషయం ఏమిటంటే.. 1985లోనే ‘బెట్టాడు హూవి’చిత్రంతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి, ఉత్తమ బాలనటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెల్చుకున్నాడు. ఈ ఘనత ఇప్పటికీ గొప్ప రికార్డ్ గానే మిగిలిపోయింది.

Also Read: మీ మెదడు పనితీరు అద్భుతంగా పని చేయాలా ?.. ఐతే.. !

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version