Hari Hara Veeramallu Record Bookings: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ వచ్చిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక పక్క సంబరాలు చేసుకుంటూ ఉంటే, మరోపక్క ఆయన దురాభిమానులు ఈ సినిమా పై ట్రోల్స్ వేస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియ పవన్ కళ్యాణ్ సినిమాలకు మాత్రమే కాదు, ప్రతీ హీరో సినిమాకు కొనసాగుతూనే ఉంటుంది. అది సర్వ సాధారణం అని చెప్పొచ్చు. అదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ముందుగా ఆంధ్ర ప్రదేశ్ లో మొదలు పెట్టారు. ఈ బుకింగ్స్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
నిన్న రాత్రి తెలంగాణ లో కూడా ఈ చిత్రానికి టికెట్ రేట్స్ పెంచుతూ, ప్రీమియర్ షోస్ కి కూడా అనుమతిని ఇస్తూ ప్రభుత్వం జీవో ని ప్రారంభించింది. దీంతో నేడు ఉదయమే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని డిస్ట్రిక్ట్ యాప్ లో మొదలు పెట్టారు. బుకింగ్స్ ప్రారంభించిన తొలి రెండు గంటల్లో 22 వేల టిక్కెట్లు, మూడు గంటల్లో 40 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. డిస్ట్రిక్ట్ యాప్ మొదలు పెట్టినప్పటి నుండి ఈ రేంజ్ బుకింగ్స్ ఏ సినిమాకు చూడలేదని సోషల్ మీడియా లో అభిమానులు అంటున్నారు. అసలు అంచనాలే లేవని అనుకున్న సినిమాకు ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం అనేది పవన్ కళ్యాణ్ స్టామినా ని నిదర్శనం. అంచనాలు లేని సినిమాకే ఈ రేంజ్ బుకింగ్స్ ఉన్నాయంటే,ఇక సెప్టెంబర్ నెలలో విడుదల అవ్వబోయే ఓజీ చిత్రానికి ఇంకెంత ర్యాంపేజ్ ఉంటుందో అని అభిమానులు ఇప్పటి నుండే అంచనాలు వేసుకుంటున్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ ఓవర్సీస్ ఫ్యాన్స్ కి చేదువార్త.. నిర్మాత AM రత్నం మామూలోడు కాదు!
బుక్ మై షో యాప్ లో ఇంకా నైజాం మరియు హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాకపోయినా, అప్పుడే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 14 కోట్ల రూపాయలకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ని సొంతం చేసుకుందని, ఇది సాధారణమైన విషయం కాదంటూ ట్రేడ్ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఊపు చూస్తుంటే కచ్చితంగా ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా వంద కోట్ల గ్రాస్ వసూళ్లను మొదటి రోజే రాబడుతుందని, అంచనాలు లేవు అనుకున్న ఈ సినిమాకు, ఇన్ని నెగటివ్ ప్రచారాల మధ్య ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడం అనేది చిన్న విషయం కాదని, ‘హరి హర వీరమల్లు’ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ని గమనిస్తున్న వాళ్ళు చెప్తున్నారు. ప్రీమియర్ షోస్ నుండి పాజిటివ్ టాక్ వస్తే మామూలు రేంజ్ లో ఉండదని, కచ్చితంగా ఊహించిన దానికంటే ఎక్కువే వస్తుందని అంటున్నారు.