https://oktelugu.com/

Samantha – Shaakuntalam : సమంత ‘శాకుంతలం’ చిత్రానికి 4 అంతర్జాతీయ అవార్డులు.. నవ్వుకుంటున్న నెటిజెన్స్!

18 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి కేవలం 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అంటే దాదాపుగా డబుల్ డిజాస్టర్ అన్నమాట. నాసిరకపు గ్రాఫిక్స్ మరియు అతి దరిద్రంగా టేకింగ్ వల్లనే ఈ సినిమా కి అలాంటి ఫలితాన్ని వచ్చిందని అంటున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 30, 2023 / 01:52 PM IST

    Samantha shakunthalam

    Follow us on

    Samantha – Shaakuntalam : ఈ ఏడాది భారీ బడ్జెట్ సినిమాగా మన ముందుకు కి వచ్చి బోల్తా కొట్టిన చిత్రం సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’ అనే చిత్రం. ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ తన డ్రీం ప్రాజెక్ట్ గా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ నిర్మాతగా కూడా వ్యవహరించాడు. షూటింగ్ కార్యక్రమాలు ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ సినిమా, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.ఎట్టకేలకు ఉన్న అడ్డంకులను తొలగించుకొని ఏప్రిల్ 14 వ తేదీన గ్రాండ్ లెవెల్ లో విడుదలై మొదటి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది.

    18 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి కేవలం 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అంటే దాదాపుగా డబుల్ డిజాస్టర్ అన్నమాట. నాసిరకపు గ్రాఫిక్స్ మరియు అతి దరిద్రంగా టేకింగ్ వల్లనే ఈ సినిమా కి అలాంటి ఫలితం ని వచ్చిందని అంటున్నారు.

    అయితే మనకి నచ్చలేదు కాబట్టి, ఇంకెవ్వరికీ నచ్చదు అని రూల్ ఏమి లేదు, ఈ సినిమాకి కేన్స్ వరల్డ్ ఫిలిం ఫెస్టివల్ లో నాలుగు అవార్డులు వచ్చాయి.ఈ విషయాన్నీ స్వయంగా గుణ టీం వర్క్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. బెస్ట్ ఫారిన్ ఫిలిం, బెస్ట్ ఫాంటసీ ఫిలిం , కాస్ట్యూమ్ డిజైన్స్ మరియు బెస్ట్ ఇండియన్ సినిమా క్యాటగిరీలలో ఈ చిత్రానికి అవార్డులు వచ్చాయి.

    ఇదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం.అసలు అవార్డ్స్ వచ్చేంత కంటెంట్ ఈ చిత్రం లో ఏముంది అంటూ సోషల్ మీడియా లో ట్రోల్ల్స్ చేస్తున్నారు. సమంత ఈ చిత్రం లో చూసేందుకు ఎంతో బాగుంది, ఆమె నటన కూడా సహజత్వానికి దగ్గర గా కూడా ఉంటుంది. కేవలం సమంత తప్ప సినిమాలో మరో పాజిటివ్ ఎలిమెంట్ లేదు. అలాంటి చిత్రానికి ఏమి చూసి అవార్డు ఇచ్చారో అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.