3BHK Trailer Review: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు సిద్ధార్థ్ (Siddarth)…అప్పట్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఓయ్, ఆట లాంటి చాలా మంచి సినిమాలు చేశాడు…కానీ గత కొద్ది రోజుల నుంచి ఆయన చేసిన సినిమాలేవి ఆయనకు ఆశించిన విజయాన్ని సాధించి పెట్టడం లేదు. ఒకప్పుడు ఆయన నుంచి సినిమా వస్తుందంటే యూత్ లో మంచి ఫాలోయింగ్ అయితే ఉండేది. మరి ఇలాంటి సిద్దార్థ్ ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలేవి పెద్దగా మెప్పించకపోవడంతో డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకొని సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ‘భారతీయుడు 2’ సినిమాలో నటించినప్పటికి ఆ సినిమా పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు. కానీ సిద్దార్థ్ పోషించిన పాత్రకి చాలా మంచి గుర్తింపు అయితే వచ్చింది. ప్రస్తుతం ఆయన 3బిహెచ్ కే అనే ఒక చిన్న సినిమాలో నటిస్తున్నాడు… శ్రీ గణేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 4 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు.
Also Read: ఆ హీరోకు భార్యగా, ఫ్రెండ్ గా, తల్లిగా నటించిన టబు. ఇంతకీ ఎందుకిలా?
ఒక ఫ్యామిలీ మొత్తం కష్టపడుతూ వాళ్ళకంటూ ఒక 3 బిహెచ్ కే ఫ్లాట్ ని కొనాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో వాళ్ళు రెంట్ కి ఉంటారు. వీళ్ళు రెంట్ కి ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఓనర్స్ నుంచి ఎలాంటి ఒత్తిడిలో ఎదురవుతాయి. అలాగే సమాజంలో ఇల్లు లేదు అనే వారికి ఎలాంటి అవమానాలు జరుగుతూ ఉంటాయి.
అనే దానిని బేస్ చేసుకొని ఈ సినిమాను తీసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ట్రైలర్ లో సిద్దార్థ్ సరిగ్గా చదువు రాక ఇబ్బంది పడుతాడు. ఎలాగో అలగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినప్పటికి జాబ్ కోసం వెళ్ళినప్పుడు అతను ఇంటర్వ్యూ లను క్రాక్ చేయడం లో ఫెయిలవుతూ ఉంటాడు. అయినప్పటికి తన ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకుండా ఎప్పటికప్పుడు కష్టపడుతూనే ఉంటాడు. తండ్రి పాత్రలో శరత్ కుమార్ కూడా తన ఎనర్జీకి మించి వర్క్ చేస్తూ ఒక ఫ్లాట్ కొనడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.
నిజానికి వీళ్లు చెప్పే ఈ సినిమా ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వర్తిస్తుంది. ఇల్లు లేకుండా ఉన్నవాళ్లు సమాజంలో చాలామంది ఉన్నారు. అలాంటి వారి కోసం ఈ సినిమాని తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. ఇక మిడిల్ క్లాస్ ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా చూపించారు. ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య, తల్లి కొడుకుల మధ్య అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే ఆ ఎమోషన్స్ ని హైలైట్ చేస్తూ ఈ సినిమాలో చూపించినట్టుగా ట్రైలర్లో ఎస్టాబ్లిష్ చేశారు… ఇక తల్లి పాత్రలో దేవయాని సైతం చాలా బాగా చేసినట్టుగా తెలుస్తోంది. హీరో సిద్ధార్థ్ ఎప్పటికప్పుడు ఫెయిలవుతూ వస్తున్నప్పటికి ఆయన మాత్రం తన గోల్ ను వదిలిపెట్టకుండా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు.
మరి ఈ సినిమా క్లైమాక్స్ లో అతను అనుకున్నది నెరవేర్చగలుగుతాడా ప్లాట్ ను తీసుకుంటారా తన తండ్రి కలను నెరవేరుస్తాడా లేదా అనేది ఈ కథాంశం… అయితే ఇందులో సిద్దార్థ్ మూడు వేరియేషన్స్ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. స్కూల్, కాలేజ్, జాబ్ పర్పస్ లో ఉన్నప్పుడు త్రీ వేరియేషన్స్ చూపిస్తూ చాలా అద్భుతంగా నటించినట్టుగా ట్రైలర్ లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. నిజ జీవితంలో సిద్దార్థ్ ఏజ్ పెరిగిన కొద్దీ ఆయన మరింత యంగ్ గా తయారవుతుండడం వల్ల ఈ సినిమాకి అతను బెస్ట్ ఆప్షన్ గా నిలిచినట్టుగా తెలుస్తోంది…మూడు నిమిషాల పాటు రిలీజ్ చేసిన ట్రైలర్లో ప్రతి ఒక్క షాట్ కూడా సినిమా తాలూకు సోల్ ను రిఫ్లెక్ట్ చేస్తూ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అలాగే ఆ ఎమోషన్ ని బిల్ చేయడంలో కూడా ట్రైలర్ ని అద్భుతంగా కట్ చేశారు. అయితే ఎంత సేపు ఇల్లు అనే అంశాన్నే ట్రైలర్ చూపించారు..సబ్ ప్లాట్ ఏమైనా ఉంటే బాగుండేది. ఎందుకంటే ఎంతసేపు అదే చూపిస్తే ఆడియెన్స్ కి బోర్ కొట్టే అవకాశం అయితే ఉంది…ముఖ్యంగా ఈ మధ్య వచ్చే సన్నివేశాలను ట్రైలర్ లో చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు…