
Dasara : దసరా మూవీకి 36 కట్స్ పడ్డాయన్న న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది. అసలు అంత మొత్తంలో సెన్సార్ సభ్యులు కట్స్ చెప్పడానికి కారణం ఏంటనే సందేహాలు మొదలయ్యాయి. దసరా మూవీ యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. మేకర్స్ కి కట్స్ సూచించడం జరిగింది. దీనిపై దర్శకుడు శ్రీకాంత్ ఓదెల స్పందించారు. నాకు సెన్సార్ నిబంధలు తెలియవు. అయితే 36 కట్స్ చెప్పినప్పటికీ అవి చిన్న చిన్నవి. మేము బాంచత్ అనే పదం వాడాము. తెలంగాణాలో విరివిగా వాడే పదం అది.
బాంచన్ అనే మరో పదం ఉంది. దానర్థం వేరు. బాంచత్ పదాన్ని పోలి ఓ బూతు పదం ఉంది. దీంతో సెన్సార్ సభ్యులు అభ్యంతరం చెప్పారు. ఓ సాంగ్ లో బాంచత్ పదం నాలుగు సార్లు వచ్చింది. అది మ్యూట్ చేయమన్నారు. ఆ విధంగా ఎక్కువ కట్స్ అనిపిస్తున్నాయి. అంతే తప్పా మా మూవీలో ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడే బూతు పదాలు, సన్నివేశాలు లేవు. అందరూ కలిసి చూసి ఎంజాయ్ చేస్తే చిత్రం… అని వివరణ ఇచ్చారు. ఎంత డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ సెన్సార్ నిబంధనలు తెలియని చెప్పడం కొంచెం విచిత్రంగా ఉంది.
క్యారెక్టర్స్ స్వభావం రీత్యా డైలాగ్స్ లో కొన్ని బూతు పదాలు వాడారు. అవన్నీ సెన్సార్ సభ్యులు మ్యూట్ చేయించారు. అలా చేయని పక్షంలో ‘ఏ’ ఇస్తామని సూచించారట. యూ /ఏ కోసం చెప్పిన కట్స్ కి మేకర్స్ ఒప్పుకున్నారు. మూవీలో వైలెన్స్ పాళ్ళు కూడా ఎక్కువే. అందుకే యూ/ఏ జారీ చేయడం జరిగింది. దసరా మూవీలో నాని ధరణిగా కీర్తి సురేష్ వెన్నెలగా నటిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. పాటకు మంచి రెస్పాన్స్ దక్కుతుంది.
మార్చి 30న వరల్డ్ వైడ్ దసరా విడుదల కానుంది. నాని నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ దసరా. ఈ చిత్ర విజయం మీద నాని పూర్తి విశ్వాసంతో ఉన్నారు. అది ఆయన మాటల్లో కనిపిస్తుంది. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మూవీ ప్రమోట్ చేస్తున్నారు. చెన్నై, బెంగుళూరు, ముంబైలో పాటు పలు నగరాల్లో పర్యటించారు. నానికి సాలిడ్ కమర్షియల్ హిట్ పడి చాలా కాలం అవుతుంది. ఆయన గత చిత్రం అంటే సుందరానికీ డిజాస్టర్ అని చెప్పాలి.