3 Roses: ప్రముఖ ఓటిటి సంస్థ ‘ఆహా’ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉందని చెప్పాలి. ఇటీవలే ఆహా 2.0 కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ తరుణంలోనే ఇప్పుడు ఆ నుంచి మరో అడల్డ్ వెబ్ సీరిస్ వచ్చేస్తోంది. ‘మారుతీ షో’ పేరుతో దర్శకుడు మారుతీ సమర్పిస్తున్న ‘3 రోజెస్’కు మగ్గీ దర్శకత్వం వహించారు. నిర్మాత ఎస్‌కేఎన్. సన్నీ ఎం.ఆర్. సంగీతం సమకూర్చారు. ఇందులో ఈషా రెబ్బా, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ కీలక పాత్రల్లో నటించారు.

అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్ ను ప్రముఖ నటి నిధి అగర్వాల్ విడుదల చేశారు. ఇందులో ఈ ముగ్గురు హీరోయిన్లు చాలా బోల్డ్‌గా కనిపిస్తున్నారు. అలానే వారి మాటలు కూడా చాలా బోల్డ్‌గా ఉన్నాయి. పాపం.. ప్రేమ.. పెళ్లి.. మోహంలో ఏది సరైన దారో తెలియక తికమక పడుతున్న ఈ ముగ్గురు భామలు నేటి సమజాన్ని పచ్చి బూతులతో తిట్టేస్తున్నారు. ఇషా రెబ్బాను రీతూగా, పాయల్ ను జాహ్నవీగా… పూర్ణాను ఇందుగా పరిచయం చేశారు. ఇష్టం లేని వ్యక్తితో పెళ్లి ఫ్రస్ట్రేషన్‌లో రీతూ, వయస్సు మీద పడుతున్నా పెళ్లి చేసుకోడానికి తగిన జోడీ దొరక్క బాధపడుతున్న అమ్మాయిగా ఇందు … పెళ్లికి ముందే అబ్బాయిలతో అడ్వాన్స్‌గా ఉండే జాహ్నవీల జీవితాల్లో ఏం జరిగిందనేది ‘3 రోజెస్’ కథనం.
ముఖ్యంగా పాయల్ రాజ్‌పూత్ తన రియల్ బాయ్‌ఫ్రెండ్ సౌరబ్‌తో ముద్దు సన్నివేశాలతో రెచ్చిపోయింది. ఇప్పటివరకు ఎంత మందితో పనైంది అనే బోల్డ్ డైలాగులతో యూత్‌ను ఆకట్టుకుంటోంది. ఇంత వయస్సు వచ్చాక పెళ్లెందుకు అంటున్న తండ్రిని చూసి బిత్తరపోయే కూతురిగా పూర్ణ బాగా సెట్ అయ్యింది. ఈ నెల 12 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.