https://oktelugu.com/

OTT : ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 24 సినిమాలు.. వీకెండ్ మూవీ లవర్స్ కి పండగే!

వీకెండ్ మాత్రం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాలు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మొత్తం మీద 24 సినిమాలు ఈ వీకెండ్ లో విడుదల అవ్వబోతుండగా, అందులో థియేటర్స్ లో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన టాప్ 4 సినిమాలు, అవి ఏ ఓటీటీ ఛానల్ లో విడుదుల అవ్వబోతున్నాయి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.

Written By:
  • Vicky
  • , Updated On : October 22, 2024 / 08:08 PM IST

    OTT Movies

    Follow us on

    OTT :  వారం మొత్తం గొడ్డు చాకిరి చేసి వీకెండ్ లో కాసేపు ఆటవిడుపు కోసం ఓటీటీలో సినిమాలు చూసేవాళ్ళు కోట్ల సంఖ్యలో ఉంటారు. థియేటర్స్ లో సినిమాలు పెద్దగా లేకపోతే, ఇక ఆడియన్స్ కి ఉన్న ఛాయస్ ఓటీటీ మాత్రమే. ప్రతీ వారం ఓటీటీ లో పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల అవుతూ ఉంటాయి. కానీ వీకెండ్ మాత్రం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాలు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మొత్తం మీద 24 సినిమాలు ఈ వీకెండ్ లో విడుదల అవ్వబోతుండగా, అందులో థియేటర్స్ లో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన టాప్ 4 సినిమాలు, అవి ఏ ఓటీటీ ఛానల్ లో విడుదుల అవ్వబోతున్నాయి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.

    సత్యం సుందరం:

    కార్తీ,అరవింద్ స్వామి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 28వ తారీఖున విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. థియేటర్స్ లో దాదాపుగా 60 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి మంచి ఫీల్ గుడ్ మూవీ గా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం ఈ నెల 25 వ తారీఖున నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది.

    డూ పట్టి :

    క్రితీ సనన్, కాజోల్ దేవగన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ ‘డూ పట్టి’ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. థియేట్రికల్ విడుదల కాకుండా, నేరుగా ఓటీటీ లోకి వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో కాజోల్ దేవగన్ పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ చేస్తుండగా, క్రితి సనన్ విలన్ రోల్ లో కనిపించనుంది. ఈ చిత్రానికి కృతి సనన్ ఒక నిర్మాతగా కూడా వ్యవహరించింది. ఈ నెల 25 వ తారీఖున ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రానుంది.

    అన్ స్టాపబుల్ సీజన్ 4 :

    నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ బిగ్గెస్ట్ టాక్ షో మూడు సీజన్స్ ని పూర్తి చేసుకొని నాల్గవ సీజన్ లోకి అడుగుపెట్టింది. మొదటి ఎపిసోడ్ కి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఆహా మీడియా లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సీజన్ ఈ నెల 25 వ తారీఖు నుండి అందుబాటులోకి రానుంది. కాసేపటి క్రితమే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేశారు మేకర్స్.

    ఫ్యూరియోసా – ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా:

    హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని ఒక ఊపు ఊపేసిన ఈ యాక్షన్ మూవీ రేపటి నుండి జియో సినిమా లో స్ట్రీమింగ్ కాబోతుంది. కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే కాకుండా తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళం భాషల్లో కూడా ఈ సినిమాని చూడొచ్చు.