2018 Closing Collections: ‘2018’ వరల్డ్ వైడ్ క్లోసింగ్ కలెక్షన్స్..15 కోట్లు పెట్టి తీస్తే ఎన్ని వందల కోట్లు లాభాలు వచ్చాయో తెలుసా!

ప్రతీ ఒక్కరి మనసుకు హత్తుకునే విధంగా ఈ సినిమా ఉండడం వల్ల, చూసిన వాళ్ళే పదే పదే థియేటర్స్ లో చూడడంతో, ఇండియా లోనే అతి చిన్న సినీ పరిశ్రమగా పేరు తెచ్చుకున్న మలయాళం ఇండస్ట్రీ నుండి వచ్చినప్పటికీ కూడా ఈ సినిమా 200 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది.

Written By: Vicky, Updated On : June 14, 2023 2:19 pm

2018 Closing Collections

Follow us on

2018 Closing Collections: మన ప్రాంతం లో జరిగే యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన కొన్ని సినిమాలు ఈమధ్య పాన్ ఇండియన్ మార్కెట్ ని దున్నేస్తున్నాయి. అలా ఈమధ్య కాలం లో ఒక మలయాళం సినిమా ట్రేడ్ పండితులను సైతం షాక్ కి గురి చేస్తూ, కనీవినీ ఎరుగని వసూళ్లను రాబట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఆ సినిమానే 2018. కేరళలో వచ్చిన వరదలను ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ సినిమా కేవలం మలయాళం వెర్షన్ నుండే 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసింది.

ప్రతీ ఒక్కరి మనసుకు హత్తుకునే విధంగా ఈ సినిమా ఉండడం వల్ల, చూసిన వాళ్ళే పదే పదే థియేటర్స్ లో చూడడంతో, ఇండియా లోనే అతి చిన్న సినీ పరిశ్రమగా పేరు తెచ్చుకున్న మలయాళం ఇండస్ట్రీ నుండి వచ్చినప్పటికీ కూడా ఈ సినిమా 200 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది.

రీసెంట్ గానే ఈ సినిమాని సోనీ లివ్ అనే ఓటీటీ యాప్ లో విడుదల చేసారు. డిజిటల్ మీడియా ఆడియన్స్ నుండి కూడా ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక తెలుగు లో ఈ చిత్రాన్ని GA2 ఆర్ట్స్ మరియు హరీష్ శంకర్ కలిసి కొనుగోలు చేసారు. అప్పటికే ఈ చిత్రం పై తెలుగు ఆడియన్స్ లో మంచి పాజిటివ్ అభిప్రాయం ఉంది. అందువల్ల ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోసింగ్ వరకు ఈ సినిమాకి అద్భుతమైన వసూళ్లు వచ్చాయి.

ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి 11 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ మరియు 5 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రాన్ని కేవలం 15 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కించారు, ఫుల్ రన్ దాదాపుగా వంద కోట్ల రూపాయిల లాభాన్ని అందుకున్నారు. ఇలాంటి అద్భుతాలు అరుదుగా జరుగుతుంటాయి, కానీ ఈమధ్య బాక్స్ ఆఫీస్ వద్ద ఇలాంటి అద్భుతాలు జరగడం చాలా కామన్ అయిపోయింది.