OTT Movie
OTT Movie : సినిమా ప్రియులకు ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్ అందిస్తూ డిజిటల్ మీడియా సంస్థలు ఆకట్టుకుంటున్నాయి. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, వెబ్ స్టోరీస్, మూవీస్ రూపంలో కొత్త కంటెంట్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ కల్కి, రాయన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఓటిటీ లో సందడి చేస్తున్నాయి. ఇక తాజాగా రెండు క్రేజీ మూవీస్ ఓటీటీలోకి అడుగు పెడుతున్నాయి. యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన పురుషోత్తముడు ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది.
దీంతో పాటు మరో స్మాల్ బడ్జెట్ సినిమా సారంగదరియా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రెండు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి? ఎక్కడ స్ట్రీమ్ కానున్నాయి? అనే వివరాలు చూద్దాం ..
రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ పురుషోత్తముడు ‘ జూలై 26న ధియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ చిత్రం పాజిటివ్ టాక్ టాక్ సొంతం చేసుకుంది. కానీ కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు. రాజ్ తరుణ్ ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొనలేదు. లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ మోసం చేశాడంటూ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన మీడియాకు దూరంగా ఉన్నాడు.
కాగా పురుషోత్తముడు మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ఆగస్టు 29 నుంచి పురుషోత్తముడు ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో హాసిని సుధీర్ హీరోయిన్ గా నటించింది. ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. రామ్ భీమన దర్శకత్వం వహించారు. గోపి సుందర్ సంగీతం అందించారు. రాజ్ తరుణ్ అభిమానులకు పురుషోత్తముడు నచ్చుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.
సీనియర్ నటుడు రాజా రవీంద్ర ప్రధాన పాత్ర పోషించిన లేటెస్ట్ మూవీ సారంగదరియా. ఈ సినిమా జూలై 12న ధియేటర్స్ లో రిలీజ్ అయింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కథ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కానీ రాజా రవీంద్ర నటనకు మంచి మార్కులు పడ్డాయి. శివ చందు, యశస్వినీ, శ్రీకాంత్ అయ్యంగార్, మెయిన్ మొహమ్మద్, నీల ప్రియ కీలక పాత్రలు పోషించారు. కాగా సారంగదరియా చిత్రం ఆగస్టు 31న ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ఈ చిత్రం కూడా ఆహాలో స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతుంది. ఇంటిల్లిపాది కలిసి చూసి ఎంజాయ్ చేయవచ్చు. సారంగదరియా ఫ్యామిలీ ఆడియన్స్ కి మంచి ఆప్షన్.
Web Title: 2 movies in 2 days ott raj tarun movie is very special where can you watch it
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com